వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

(ఫోటోలు) భారీ వర్షాలతో ముంబై అతలాకుతలం, ఆగిన డబ్బావాలా సేవలు

By Srinivas
|
Google Oneindia TeluguNews

ముంబై: దేశ ఆర్థిక రాజధాని ముంబై నగరం భారీ వర్షాలతో అల్లాడుతోంది. కుండపోత వర్షం కారణంగా పలు రైళ్లు నిలిచిపోయాయి. భారీ ట్రాఫిక్ జామ్ అవుతోంది. డబ్బావాలాలు మంగళవారం సేవలు నిలిపివేశారు. వర్షాలతో ముంబై అతలాకుతలం అవుతోంది. జనజీవనం స్తంభించిపోయింది.

Recommended Video

మహారాష్ట్రకు రెడ్ కలర్ హెచ్చరికలు జారీ చేసిన వాతావరణ శాఖ

భారీ వర్షాల కారణంగా రోడ్లు మొత్తం జలమయమయ్యాయి. రైలు పట్టాల పైకి నీరు చేరింది. ఎడతెరిపి లేకుండా వర్షం కురుస్తుండడంతో ప్రజలు నానా ఇబ్బందులు పడుతున్నారు. పశ్చిమ రైల్వే సబర్బన్‌ సర్వీసులు నిలిచిపోయాయి. రాత్రి 200 మీటర్ల వర్షపాతం నమోదయింది. నగరంలో చాలా ప్రాంతాలు జలమయమయ్యాయి. నీళ్లు తగ్గే వరకు రైళ్లను నిలిపివేస్తున్నట్లు తెలిపారు.

Non Stop Rain In Mumbai, Trains Hit, Schools Closed In Thane

పలు రైళ్లు ఆలస్యంగా నడుస్తున్నాయి. రోడ్లు జలమయం. దీంతో కార్యాలయాలకు వెళ్లే వాళ్లు ఇబ్బందులు పడుతున్నారు. గురువారం వరకు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది. గ్రేటర్‌ ముంబై, థానే, రాయిగఢ్‌, పాల్‌గఢ్‌ ప్రాంతాల్లో వర్షాలు అధికంగా కురుస్తాయని తెలిసింది. భారీ వర్షాల కారణంగా నగరంలో ప్రజలకు మంచి నీరు సరఫరా చేసే తులసి సరస్సు పొంగి ప్రవహిస్తోంది.

Non Stop Rain In Mumbai, Trains Hit, Schools Closed In Thane

ఆఫీసు ఉద్యోగులకు భోజనం తీసుకు వెళ్లే డబ్బావాలాలు మంగళవారం తమ సేవలు నిపిలివేస్తున్నట్లు ప్రకటించారు. నగరంలోని చాలా ప్రాంతాల్లో మోకాళ్ల లోతు నీళ్లు నిలిచిపోవడం వల్ల తాము టిఫిన్‌ బాక్సులు సరఫరా చేయలేమని తెలిపారు. ముంబై విమానాశ్రయంలో విజిబులిటీ తక్కువగా ఉన్నప్పటికీ విమానాలు యథావిధిగా నడుస్తున్నాయి.

English summary
Mumbai is struggling in non-stop rain that has stalled trains and slowed traffic to a crawl in places that have been flooded.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X