ఇక ఆటలు సాగవ్, నా వెనుక లెక్కబెట్టుకోండి: రిసార్ట్ వద్ద శశికళ హైడ్రామా
అన్నాడీఎంకే తాత్కాలిక ప్రధాన కార్యదర్శి శశికళ ఆదివారం నాడు ఆపద్ధర్మ ముఖ్యమంత్రి పన్నీరు సెల్వం పైన తీవ్రస్థాయిలో మండిపడ్డారు. ఆమె గోల్డెన్ బే రిసార్టులో తన వర్గం ఎమ్మెల్యేలను కలిసిన అనంతరం మాట్లాడారు.
చెన్నై: అన్నాడీఎంకే తాత్కాలిక ప్రధాన కార్యదర్శి శశికళ ఆదివారం నాడు ఆపద్ధర్మ ముఖ్యమంత్రి పన్నీరు సెల్వం పైన తీవ్రస్థాయిలో మండిపడ్డారు. ఆమె గోల్డెన్ బే రిసార్టులో తన వర్గం ఎమ్మెల్యేలను కలిసిన అనంతరం విలేకరులతో మాట్లాడారు.
ఈ సందర్భంగా తీవ్రంగా స్పందించారు. అన్నాడీఎంకేను చీల్చడానికి కొందరు కుట్ర చేస్తున్నారని ధ్వజమెత్తారు. తాను ఎమ్మెల్యేలను నిర్బంధించలేదని చెప్పారు. తన పైన అసత్య ప్రచారం జరుగుతోందన్నారు.
ఆటలు సాగనివ్వం.. అక్రమాస్తుల కేసుపై..
మమ్మల్ని వ్యతిరేకించే వారి ఆటలు ఇంకా ఎంతో కాలం సాగనివ్వమని హెచ్చరించారు. అవాస్తవాలను ప్రచారం చేస్తున్న వారు ఎవరో తమకు తెలుసునని చెప్పారు. పన్నీరు వర్గం అబద్దపు ప్రచారాలు చేస్తోందన్నారు. అక్రమాస్తుల కేసుపై తీర్పు వచ్చిన తర్వాత చూద్దామన్నారు.

నా వెనుక ఎంతమంది ఉన్నారో లెక్కపెట్టుకోండి.. నా తర్వాత అడుగు
తన వర్గం నుంచి ఎమ్మెల్యేలు వెళ్తున్నారన్న దాని పైన శశికళ స్పందించారు. ఎమ్మెల్యేలు అందరూ తన వెంటే ఉన్నారన్నారు. కావాలంటే నా వెనుక ఎంతమంది ఉన్నారు లెక్కబెట్టుకోండి అన్నారు. నా తర్వాత అడుగు ఏమిటో మీకు తెలుస్తుందని చెప్పారు. గోల్జెన్ బే స్టార్ హోటల్ వేదికగా చిన్నమ్మ బలప్రదర్శన చేశారు.
కిడ్నాప్ బెదిరింపు.. నా కళ్లలో నీళ్లు
ఎమ్మెల్యేలను నిర్బంధించామంటున్నారని, వారు వారి కుటుంబ సభ్యులతో మాట్లాడుతున్నారని, అందరు శాసనసభ్యులు స్వతంత్రంగానే ఉన్నారని, ప్రత్యర్థులు మా శాసనసభ్యులను బెదిరిస్తున్నారని, మహిళా ఎమ్మెల్యేలకు ఫోన్లు చేసి.. వారి పిల్లలను అపహరిస్తామని బెదిరిస్తున్నారని, పార్టీ కోసం ఎమ్మెల్యేల క్రమశిక్షణ చూసి తన కళ్లలో నీళ్లు తిరిగాయని, ప్రత్యర్థులు గందరగోళం సృష్టించేందుకు ప్రయత్నిస్తున్నారని శశికళ అన్నారు.












Click it and Unblock the Notifications