జహంగీర్ పూరాలో ఉద్రిక్తత- అక్రమ నిర్మాణాల కూల్చివేత : బుల్డోజర్లు ఎంట్రీ -ఉద్రిక్తత..!!
ఢిల్లీలో జహంగీర్ పూరాలో ఉద్రిక్తత కొనసాగుతోంది. శ్రీరామ నవమి సమయంలో అక్కడ హింసాత్మ ఘటనలు చోటు చేసుకున్నాయి. ఆ తరువాత భద్రత కోసం వెళ్లిన పోలీసు పైన రాళ్లు రువ్వటంతో పరిస్థితి తీవ్ర రూపం దాల్చింది. ఈ సమయంలోనే కేంద్రంతో పాటుగా.. ఢిల్లీ ప్రభుత్వం అక్కడ పరిస్థితులు చక్కదిద్దేందుకు ప్రయత్నాలు చేసాయి. ఇక, అక్కడ అక్రమంగా నిర్మాణాలు ఉన్నాయని..వాటిని తొలిగించాలని అధికారులు నిర్ణయించారు. అందులో భాగంగా ఇప్పటికే అక్కడ ఉన్న వారికి నోటీసులు ఇచ్చారు. ఈ రోజు ఉదయం నుంచి దాదాపు 20 బుల్డోజర్లతో అక్రమ నిర్మాణాల కూల్చవేతలు మొదలయ్యాయి.
దీనిపై ఆప్ మండిపడింది. దేశ రాజధానిలో శాంతియుత వాతావరణానికి విఘాతం కలిగించేందుకు బీజేపీ..అమిత్ షా కుట్ర చేస్తున్నారని ఆరోపించింది. ఉత్తర ఢిల్లీ కార్పోరేషన్ అధికారులు బుల్డోజర్లతో అక్రమంగా నిర్మించిన కట్టడాలను కూల్చేస్తున్నారు. రెండు రోజుల పాటు ఈ కార్యక్రమం ఉంటుందని చెప్పారు. నిర్మాణాల కూల్చివేత నేపథ్యంలో ఉదయం నుంచి భారీగా పోలీసులను మోహరించారు అధికారులు. మహిళా సిబ్బందిని కూడా రంగంలోకి దించారు. నార్త్ దిల్లీ మున్సిపల్ కార్పొరేషన్లో భాజపా అధికారంలో ఉంది. ఓ వర్గాన్ని లక్ష్యంగా చేసుకుని, వారిని వేధించేందుకు రంజాన్ లాంటి పవిత్ర మాసంలో ఇలా చేయడం దారుణమని దిల్లీ వక్ఫ్ బోర్డు ఛైర్మన్ అమానాతుల్లా ఖాన్ ఆరోపించారు.

దిల్లీలో ప్రస్తుతమున్న శాంతియుత వాతావరణానికి విఘాతం కల్గించేందుకు కుట్ర చేస్తున్నారంటూ ఆప్ ఎమ్మెల్యేగానూ ఉన్న ఆయన ఆగ్రహం వ్యక్తం చేారు. అనేక చోట్ల పరిస్థితులు బాగాలేవని చెప్పారు. భాజపా ఇలాంటి చర్యలకు దూరంగా ఉండాలని డిమాండ్ చేసారు. ఢిల్లీలో ఒక ప్రాంతానికే పరిమితం కాకుండా.. ఢిల్లీ వ్యాప్తంగా దురాక్రమణ వ్యతిరేక కార్యక్రమం కొనసాగుతుందని ఎన్ఎండీసీ మేయర్ రాజా ఇక్బాల్ సింగ్ స్పష్టం చేశారు.

అనుమతులు లేకుండా అక్రమంగా నిర్మించిన వాటిని మాత్రమే కూల్చేస్తున్నట్లు పేర్కొన్నారు. ఈ నెల 16న హునుమాన్ శోభాయాత్ర నిర్వహిస్తుండగా ఈ ప్రాంతంలో హింస చెలరేగింది. అల్లరి మూకలు రాళ్లురువ్వడం వల్ల ఇరు వర్గాల మధ్య ఘర్షణ తలెత్తింది. ఈ ఘటనలో పోలీసులు సహా పులువురు గాయపడ్డారు. ఇప్పుడు ఆ ప్రాంతంలో బుల్డోజర్లతో కూల్చివేతల వ్యవహారం రాజకీయంగా వివాదంగా టర్న్ తీసుకుంది.












Click it and Unblock the Notifications