వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఉత్తరాది విద్యార్థులతోనే కరోనా వ్యాప్తి చెందుతోంది: తమిళనాడు మంత్రి వివాదాస్పద వ్యాఖ్యలు

|
Google Oneindia TeluguNews

చెన్నై: తమిళనాడు మంత్రి ఉత్తరాది విద్యార్థులపై వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలో కోవిడ్-19 కేసులు పెరగడానికి ఉత్తర భారత విద్యార్థులే కారణమంటూ తమిళనాడు ఆరోగ్య మంత్రి సుబ్రమణియన్ బుధవారం చేశారు. ఈ వ్యాఖ్యలు ట్విట్టర్‌లో దుమారం రేపాయి.

'ఉత్తర భారత విద్యార్థులు తమిళనాడులో కరోనా వైరస్‌ను వ్యాప్తి చేస్తున్నారు. కేళంబాక్కం వీఐటీ కళాశాల, సత్యసాయి కళాశాల విద్యార్థులు హాస్టళ్లు, తరగతులలో కరోనావైరస్ సంక్రమణతో ప్రభావితమయ్యారు' అని మంత్రిని ఉటంకిస్తూ ఏఎన్ఐ తెలిపింది.

North Indian students spreading COVID: controversial statement by Tamil Nadu health minister

మంత్రి వ్యాఖ్యలపై సర్వత్రా ఆగ్రహం వ్యక్తమవుతోంది. మంత్రి క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేస్తూ పార్టీలకు అతీతంగా పలువురు రాజకీయ నాయకులు సోషల్ మీడియా వేదికగా మండిపడుతున్నారు. బీజేపీ నాయకుడు జితిన్ ప్రసాద ట్విట్టర్ వేదికగా స్పందిస్తూ.. 'అత్యంత బాధ్యతారహితం, అవమానకరమైనది, ఉత్తర భారతీయులను అవమానించేది' అని మంత్రి వ్యాఖ్యలను ఉద్దేశిస్తూ ధ్వజమెత్తారు.

ఇప్పటికే హిందీ భాషపై తమిళనాడు సీఎం సహా మంత్రులు తమ నిరసన వ్యక్తం చేస్తూనే ఉన్నారు. హిందీ జాతీయ భాష కాదంటూ వ్యాఖ్యలు చేస్తున్నారు. హిందీని తమపై రుద్దే ప్రయత్నం చేయవద్దని తమిళ నేతలు ఇప్పటికే వ్యాఖ్యానిస్తున్న విషయం తెలిసిందే. అయితే, తాజాగా మంత్రి వ్యాఖ్యలపై సర్వత్రా నిరసనలు వ్యక్తమవుతున్నాయి.

English summary
North Indian students spreading COVID: controversial statement by Tamil Nadu health minister.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X