ఆ జర్నలిస్ట్‌లకు అవార్డులివ్వాలి: ఆధార్ ఉల్లంఘనపై ఎడ్వర్డ్ స్నోడెన్

Posted By:
Subscribe to Oneindia Telugu

ముంబై: ఆధార్ డేటాపై ఎడ్వర్డ్ స్నోడెన్ ఇటీవల సంచలన వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. ప్రజల డేటాను సురక్షితంగా ఉంచామని ప్రభుత్వాలు చెబుతుంటాయని, కానీ ఆ డేటా హ్యాకింగ్‌కు గురికావడం సాధారణ విషయమే అన్నారు.

ఆధార్ గోప్యతపై ఎడ్వర్డ్ స్నోడెన్ సంచలన వ్యాఖ్యలు

తాజాగా, మరోసారి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఆధార్ డేటా ఉల్లంఘన విషయంలో జర్నలిస్టులపై ఎఫ్ఐఆర్ నమోదు చేయడం కాకుండా, వారికి అవార్డులు ఇవ్వాలని సూచించారు. సదరు జర్నలిస్టులపై విచారణ సరికాదని ఆయన పేర్కొన్నారు.

Not FIR but awards for journalists exposing Aadhaar breach: Edward Snowden

ప్రభుత్వం న్యాయం కోసమే పని చేస్తుంటే కనుక తమ పాలసీలను సంస్కరించాలని వ్యాఖ్యానించారు. కోట్లాది భారతీయుల ప్రైవసీని నాశనం చేసే వాటిని సంస్కరించాలని అభిప్రాయపడ్డారు.

ఇటీవల ఎడ్వర్డ్ స్నోడెన్ మాట్లాడుతూ.. చట్టాలు ఉన్నా దుర్వినియోగాన్ని ఆపలేకపోయిందని చరిత్ర చెబుతోందన్నారు. వ్యక్తిగత జీవితాల సంపూర్ణ రికార్డులను తెలుసుకోవడం ప్రభుత్వల సహజ ధోరణి అన్నారు.

ఇంకా వివాహం చేసుకోలేదా? తెలుగు మ్యాట్రిమోనిలో నేడే రిజిస్టర్ చేసుకోండి - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
Amid continuous outrage over the Aadhaar data breach that was reported after an investigation by The Tribune earlier this month, and the consequent FIR filed by Unique Identification Authority of India (UIDAI), US whistle-blower Edward Snowden spoke up again on Tuesday in defence of the concerned journalist.

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి

X