వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

వివాదం: ఆయనే కాదు, కాంగ్రెసు ఐటి సెల్ చీఫ్ కూడా ట్వీట్

By Pratap
|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: కర్ణాటక శానససభ ఎన్నికల తేదీలను ఎన్నికల కమిషన్ (ఈసీ) ప్రకటించడానికి ముందే బిజెపి ఐటి సెల్ చీఫ్ అమిత్ మాల్వియా ఆ తేదీలను ట్వీట్ చేసిన సంఘటనపై వివాదం చెలరేగుతున్న సమయంలోనే మరో విషయం వెలుగు చూసింది.

మాల్వియా ఇచ్చిన తేదీలనే ఇస్తూ ఆయన ట్వీట్ చేసిన సమయానికే కర్ణాటక కాంగ్రెసు సోషల్ హెడ్ మీడియా ఇంచార్జీ శ్రీవాత్సవ కూడా కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలపై ట్వీట్ చేశారు. సరిగ్గా మంగళవారం ఉదయం 11.08 గంటలకు ఈ ట్వీట్ చేశారు.

అయితే, ఆ తర్వాత ఆ ట్వీట్‌ను తొలగించారు. కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ మే 12వ తేదీన జరుగతుందని సరిగానే ట్వీట్ చేసినప్పటికీ ఇరువురు కూడా ఓట్ల లెక్కింపు మే 18వ తేదీ జరుగుతుందని ట్వీట్ చేశారు. అయితే, ఈసీ ప్రకటించిన ప్రకారం ఓట్ల లెక్కింపు మే 15వ తేదీన జరుగుతుంది.

ఒకే దశలో పోలింగ్ జరుగుతుందని మాల్వియా, శ్రీవాత్సవ అంచనా వేశారు గానీ ఓట్ల లెక్కింపు తేదీ విషయంలో మాత్రం అంచనాకు రాలేకపోయారు.

స్థానిక, జాతీయ మీడియాలో తేదీలను ప్రసారం చేస్తుండడంతో ఈసి ప్రకటించిందనే ఉద్దేశంతో తాను ట్వీట్ చేసినట్లు శ్రీవాత్సవ తెలిపారు. అంతే తప్ప అందులో ఏమీ లేదని ఆయన ట్వీట్ చేశారు.

టీవీ చానెల్ సోర్స్ ఆధారంగానే మాల్వియా ట్వీట్ చేశారని బిజెపి మంత్రి ముక్తార్ అబ్బాస్ నఖ్వీ చెప్పారు. ఈసీని తక్కువ చేసే ఉద్దేశం తమకు లేదని స్పష్టం చేశారు.

English summary
Karnataka Congress' social head media in-charge Srivatsa also tweeted about the same dates at exactly the same time - 11:08 am.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X