వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

అలా తాకితే లైంగిక వేధింపులు కాదు:కోర్టు

By Narsimha
|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: ప్రతి విషయాన్ని లైంగిక వేధింపులుగా పరిగణించాల్సిన అవసరం లేదని ఢిల్లీ హైకోర్టు అభిప్రాయపడింది. అయితే పనిచేసే సంస్థల్లో మహిళలపై వేధింపులు జరుగుతున్న మాట వాస్తవమేని కోర్టు ప్రకటించింది.

సెంట్రల్ రోడ్ రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్ (సీఆర్ఆర్ఐ) మాజీ సైంటిస్టుపై నమోదైన లైంగిక వేధింపుల కేసు విచారణలో భాగంగా గురువారం జస్టిస్ విభు భక్రూ ఆ తీర్పును వెల్లడించారు. సహోద్యోగినిని ఆయన తాకారని, కానీ అప్పుడు జరిగిన విషయాన్ని వేధింపులుగా చూడలేమని ధర్మాసనం స్పష్టం చేసింది.

'కార్యాలయాల్లోగానీ ఇతర ఏదైనా సంస్థల్లోగానీ విధులలో భాగంగా పొరపాటున పురుష, మహిళా ఉద్యోగులు పరస్పరం ఒకరినొకరు తాకే అవకాశాలున్నాయి. అలా తాకితే ప్రతి విషయాన్ని లైంగిక వేధింపులు జరిగినట్లుగా చూడలేమని కోర్టు ప్రకటించింది.

Not All Unwanted Physical Contact Is Sexual Harassment, Says Delhi High Court

చెడు ఉద్దేశంతో మహిళలను బలవంతంగా తాకడం లైంగిక వేధింపులకు దారి తీసే అవకావం ఉందని కోర్టు అభిప్రాయపడింది అలాంటి సందర్భాల్లో బాధిత మహిళలు వేధింపులపై ఫిర్యాదు చేయవచ్చు'నంటూ ఢిల్లీ హైకోర్టు న్యాయమూర్తి విభు బక్రూ తెలిపారు.

2005 ఏప్రిల్ లో సహోద్యోగి తనను తాకాడని ఆరోపిస్తూ ఓ మహిళా సైంటిస్ట్ లైంగిక వేధింపులపై ఫిర్యాదు చేశారు. 'నేను ల్యాబ్‌లో పని చేస్తుండగా నా సహోద్యోగి గదిలోకి వచ్చాడు. నా చేతిని పట్టుకుని లాగాడు. చేతిలో ఉన్న శాంపిల్స్ ను తీసుకుని కింద పడేశాడు. ఆపై రూము నుంచి బయటకు నెట్టేశాడంటూ' మహిళా సైంటిస్ట్ తన సహోద్యోగిపై లైంగిక వేధింపుల కేసు పెట్టారు.

'ఆ సైంటిస్ట్ ఆమె చేసిన పనిని అడ్డుకున్నట్లు తెలుస్తోంది. ఆవేశంలో ఆమెను చేతి పట్టుకుని లాగినట్లు అర్థం చేసుకోవచ్చు. తాకడాన్ని సాకుగా చూపించి లైంగికంగా వేధించాడంటూ ఫిర్యాదు చేయడం సబబుకాదని కోర్టు అభిప్రాయపడింది.వేధింపులు నిజంగానే జరిగితే కఠిన శిక్షలు విధిస్తామని' ధర్మాసనం ప్రకటించింది.

English summary
All unwelcome physical contact cannot be called sexual harassment unless it is in the nature of sexually oriented behaviour, the Delhi High Court has said.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X