Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

పాకిస్తాన్ పై భారత్ అనూహ్య చర్య

ప్రపంచం మొత్తాన్నీ ఉలిక్కిపడేలా చేసిన ఉదంతం.. పహల్గామ్ ఉగ్రదాడి. ఈ ఏడాది ఏప్రిల్ 22వ తేదీన సంభవించిన ఈ దారుణ ఉదంతంలో 26 మందిని పొట్టనబెట్టుకున్నారు పాకిస్తాన్ ప్రోత్సాహిత ఉగ్రవాదులు. ఈ ఘాతుకంపై అమెరికా మొదలుకుని ఆఫ్ఘనిస్తాన్ దాకా దాదాపుగా అన్ని దేశాలు స్పందించాయి. భారత్‌కు అండగా నిలిచాయి. ఉగ్రవాద నిర్మూలనకు సహకరిస్తామని వెల్లడించాయి.

ఈ దిగ్భ్రాంతికర ఘటనను కేంద్ర ప్రభుత్వం అత్యంత తీవ్రంగా పరిగణనలోకి తీసుకుంది. పాకిస్తాన్‌పై కఠిన ఆంక్షలను విధించింది. ఇండస్ రివర్ ట్రీటీ సహా పలు కీలక నిర్ణయాలను అమలులోకి తీసుకొచ్చింది. అట్టారీ-వాఘా సరిహద్దు చెక్‌పోస్ట్‌ను మూసివేయడమే కాకుండా దేశంలో నివస్తోన్న పాకిస్తానీయులనూ స్వదేశానికి వెళ్లిపోవాలంటూ ఆదేశించింది.

NOTAM restricting Pakistani aircraft from entering Indian airspace extended

అప్పట్లోనే భారత గగనతలంలోకి పాకిస్తాన్ విమానాల రాకను నిషేధించింది కేంద్ర ప్రభుత్వం. పహల్గామ్ ఉగ్రవాద దాడి ఘటనకు ప్రతీకార చర్యల్లో భాగంగా పాక్ విమానాలకు బ్రేకులు వేసింది. భారత గగనతలంలోకి పాక్ విమానాలేవీ ప్రవేశించకుండా అడ్డుకుంది. ఫలితంగా- చుట్టూ తిరిగి వెళ్తోన్నాయి పాక్ పౌర విమానాలన్నీ.

తాజాగా కేంద్ర ప్రభుత్వం ఈ నిషేధాన్ని పొడిగించింది. భారత గగనతలంలోకి పాకిస్తాన్ విమానాల రాకపోకలపై విధించిన నిషేధాన్ని ఆగస్టు 23 వరకు పొడిగించింది. ఈ విషయాన్ని పౌర విమానయాన శాఖ సహాయ మంత్రి మురళీధర్ మోహోల్ వెల్లడించారు. ఈ మేరకు తన అధికారిక ఎక్స్ అకౌంట్ లో ఈ సమాచారాన్ని పోస్ట్ చేశారు.

నోటీసు టు ఎయిర్‌మెన్ (NOTAM)ను అధికారికంగా 2025 ఆగస్టు 23 వరకు పొడిగించినట్లు తెలిపారు. పహల్గామ్ ఉగ్రవాద దాడి తరువాత మే నెలలో భారత్-పాకిస్తాన్ మధ్య తీవ్ర ఉద్రిక్తతలు నెలకొన్న విషయం తెలిసిందే. అమెరికా మధ్యవర్తిత్వంతో కాల్పుల విరమణ ఒప్పందం జరగడంతో పరిస్థితి సద్దుమణిగింది.

అప్పట్లోనే పాక్ విమానాలు భారత గగనతలంలోకి ప్రవేశించడాన్ని నిషేధించింది. భద్రతపరమైన కారణాల దృష్ట్యా ఈ ఆంక్షలు విధించింది. దీని కారణంగా పాకిస్తాన్ విమానయాన సంస్థలు భారత్ మీదుగా రాకపోకలు సాగించట్లేదు. ఫలితంగా వాటి ప్రయాణ సమయం దాదాపు 10-15 శాతం వరకు పెరుగుతోంది. 2019లో గగనతలం మూసివేసినప్పుడు కూడా ఇలాంటి ప్రభావమే కనిపించిందని పాకిస్తాన్ మీడియా వెల్లడించింది.

ఈ నిర్ణయం 1947 నాటి అంతర్జాతీయ పౌర విమానయాన ఒప్పందంలోని నిబంధనలకు అనుగుణంగా ఉంది. భౌగోళిక రాజకీయపరమైన సంఘర్షణలు తలెత్తినప్పుడు గగనతలాన్ని నియంత్రించడానికి ఇలాంటి నోటీసులు జారీ చేయడం సాధారణమే. దీనివల్ల ఉద్రిక్తతలు తలెత్తినప్పుడు రెండు దేశాలు కూడా తమ గగనతలాన్ని మూసివేస్తూ వస్తోన్నాయి.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+