పెద్దనోట్లు రద్దు, బ్లాక్ డే: గాంధీ ఆశయాలకు బీజేపీ వ్యతిరేకం, సూరత్ లో రాహుల్ గాంధీ ఫైర్ !

Posted By:
Subscribe to Oneindia Telugu

సూరత్: కేంద్రంలోని ఎన్డీఏ ప్రభుత్వం తీసుకున్న పెద్దనోట్ల రద్దు, జీఎస్టీ కారణంగా దేశంలోని పేదలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారని కాంగ్రెస్ పార్టీ జాతీయ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ ఆరోపించారు. అనేక మంది రోడ్డున పడటానికి కారణం అయిన బీజేపీ నాయకులు వెంటనే ప్రజలకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.

పెద్దనోట్లు రద్దు అయిన నవంబర్ 8వ తేదీన కాంగ్రెస్ పార్టీ దేశ వ్యాప్తంగా బ్లాక్ డే పాటించింది. గుజరాత్ లోని సూరత్ లో జరిగిన బ్లాక్ డే కార్యక్రమంలో రాహుల్ గాంధీ పాల్గొని మోడీ ప్రభుత్వం మీద విమర్శలు చేశారు. సూరత్ అంటే చేనేత పరిశ్రమలు, టెక్స్ టైల్స్ పరిశ్రమలకు పెట్టింది పేరు అని గుర్తు చేశారు.

Note ban, GST have broken textiles hub Surat’s legs: Rahul Gandhi

ఇలాంటి సూరత్ లో పెద్దనోట్ల రద్దు కారణంగా టెక్స్ టైల్స్ పరిశ్రమలు వరుసగా మూసి వేస్తున్నారని, వేలాధి మంది కార్మికులు జీవనోపాధి కొల్పోయి రోడ్డున పడ్డారని ఆరోపించారు. చేనేత పరిశ్రమలను ప్రోత్సహించాలని స్వయంగా మహాత్మగాంధీ చెప్పిన విషయం గుర్తు చేశారు.

మహాత్మగాంధీ ఆశయాలకు వ్యతిరేకంగా బీజేపీ నాయకులు, ఎన్డీఏ ప్రభుత్వం పని చేస్తోందని రాహుల్ గాంధీ ఆరోపించారు. టెక్స్ టైల్స్ పరిశ్రమల హబ్ గా గుర్తింపు తెచ్చుకున్న సూరత్ లో నేడు పరిశ్రమలు అన్ని మూసి వేస్తున్నారని విచారం వ్యక్తం చేశారు. గుజరాత్ లో జరిగే శాసన సభ ఎన్నికల్లో అధికారంలో ఉన్న బీజేపీకి తగిన బుద్ది చెప్పాలని రాహుల్ గాంధీ ప్రజలకు మనవి చేశారు.

ఇంకా వివాహం చేసుకోలేదా? తెలుగు మ్యాట్రిమోనిలో నేడే రిజిస్టర్ చేసుకోండి - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
Lashing out at the Centre, Congress vice president Rahul Gandhi on Wednesday said note ban and GST rollout have broken the legs of Surat as he observed a "black day" in the country's textile and diamond hub.

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి