డీఎంకే పార్టీ ఎమ్మెల్యేలకు షోకాజ్ నోటీసులు ఇచ్చిన సఘా హక్కుల సంఘం

Posted By:
Subscribe to Oneindia Telugu

చెన్నై: తమిళనాడు అసెంబ్లీలో నియమాలు ఉల్లంఘించి నానా హంగామా చేశారని ఆరోపిస్తూ 8 మంది డీఎంకే ఎమ్మెల్యేలకు సభా హక్కుల సంఘం షోకాజ్ నోటీసులు జారీ చేసింది. నోటీసులకు సమాదానం ఇవ్వాలని ఆదేశాలు జారీ చేసింది.

చిన్నమ్మ'శశికళ ఫ్యామిలీ'లో చిచ్చు: రగిలిపోతున్నారు, మొదటికే మోసం !

ఫిబ్రవరి 18వ తేదీన తమిళనాడు సచివాలయంలో ఎడప్పాడి పళనిసామి బలపరీక్షలో మెజారిటీ నిరూపించుకునే సమయంలో సీక్రెట్ ఓటింగ్ కు అనుమతి ఇవ్వాలని డీఎంకే పార్టీ ఎమ్మెల్యేలు డిమాండ్ చేశారు.

The privilege committee of the Tamil Nadu assembly issued notices to 8 DMK MLAs on Friday for the February 18 ruckus.

ఆ సమయంలో సీక్రెట్ ఓటింగ్ నిర్వహించడానికి స్పీకర్ ధనపాల్ అంగీకరించకపోవడంతో డీఎంకే పార్టీఎమ్మెల్యేలు నిరసన వ్యక్తం చేసి సభలో కర్చీలు, పేపర్లు విసిరివేశారు. తరువాత మార్షల్స్ డీఎంకే పార్టీవర్కింగ్ ప్రెసిడెంట్, శాసన సభలో ప్రధాన ప్రతిపక్ష నాయకుడు ఎంకే. స్టాలిన్ తో సహ 89 డీఎంకే ఎమ్మెల్యేను బలవంతంగా బయటకు పంపించారు.

శశికళకు ఒక నెల పూర్తి అయ్యింది: దిక్కే లేకుండా జైల్లో పాపం ఇలా !

తరువాత 122 మంది శశికళ వర్గంలోని అన్నాడీఎంకే ఎమ్మెల్యేలు ఎడప్పాడి పళనిసామికి మద్దతుగా, 12 మంది ఎమ్మెల్యేలు పన్నీర్ సెల్వంకు మద్దతుగా ఓటు వేశారు. శాసన సభ నియమాలు ఉల్లంఘించిన డీఎంకే ఎమ్మెల్యేలపై చర్యలు తీసుకోవాలని అన్నాడీఎంకే పార్టీ ఎమ్మెల్యే వెట్రివేల్ సభా హక్కుల సంఘానికి ఫిర్యాదు చేశారు.

అన్నాడీఎంకే ఎమ్మెల్యే వెట్రివేల్ ఫిర్యాదును పరిశీలించిన తమిళనాడు శాసన సభా హక్కుల సంఘం 8 మంది డీఎంకే ఎమ్మెల్యేలకు శుక్రవారం షోకాజ్ నోటీసులు జారీ చేసింది. సభా హక్కుల సంఘం తీరుపై డీఎంకే ఎమ్మెల్యేలు మండిపడుతున్నారు.

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
The privilege committee of the Tamil Nadu assembly issued notices to 8 DMK MLAs on Friday for the February 18 ruckus.
Please Wait while comments are loading...