ఎన్నికలు: టికెట్ కోసం పెళ్లి చేసుకున్నాడు
కొల్లామ్: ఎన్నికలు వస్తున్నాయంటే రాజకీయ నాయకులు ప్రచారంతో హోరెత్తిస్తారు. అంతేగాక, ప్రజల్లో మమేకమై తిరుగుతుంటారు. ఓట్ల కోసం ఎన్నో పాట్లు పడుతుంటారు. అయితే, ఇక్కడ మాత్రం ఎన్నికల్లో పోటీ చేసేందుకు ఓ నాయకుడు పెళ్లి చేసుకున్నాడు. ఈ ఘటన కేరళలోని కొల్లామ్ జిల్లాలో చోటు చేసుకుంది.
వివరాల్లోకి వెళితే.. రాష్ట్రంలో నవంబర్ 2న పురపాలక ఎన్నికలు జరుగనున్నాయి. నెడవతూర్ పంచాయతీ పరిధిలోని నాలుగో వార్డు నుంచి కేఆర్ రాజేశ్ అనే వ్యక్తి ఎల్‌డిఎఫ్ తరపున పోటీ చేసేందుకు సిద్ధమయ్యాడు.

అయితే ఇంతలో ఆ వార్డు మహిళలకు కేటాయించినట్లు అధికారులు వెల్లడించారు. అయితే టికెట్‌పై నిరాశ వద్దని, పెళ్లి చేసుకుంటే నీ భార్యకే టికెట్ ఇస్తామంటూ పార్టీ వర్గాలు సూచించాయి. దీతో ఆలస్యం చేయకుండా రాజేశ్.. వివాహం చేసుకున్నాడు.
ఇప్పుడు అతని భార్య అయిన మహిళతో నామినేషన్ కూడా వేయించాడు. ఆమె తనకు నచ్చిందని, అంతకుమించి ఎన్నికల్లో పోటీ చేసేందుకు ఒప్పుకుందని.. అందుకోసమే ఆమెను వివాహం చేసుకున్నాని చెప్పుకొస్తున్నాడు రాజేష్. కాగా, ఇప్పుడు ఇద్దరు కలిసి ఎన్నికల ప్రచారంలో పాల్గొంటున్నారు.












Click it and Unblock the Notifications