జయ మృతి: పన్నీరు సెల్వం వెనుక శశికళ, అప్పుడే పట్టు కోసం పావులు?

జయలలిత సోమవారం రాత్రి కన్నుమూశారు. ఆమె మృతితో తమిళనాడులో అప్పుడే రాజకీయ కుట్రలు మొదలయ్యాయని అంటున్నారు. ఆధిపత్య పోరు ప్రారంభమైంది. ఎత్తులు, పై ఎత్తులు మొదలయ్యాయి.

చెన్నై: జయలలిత సోమవారం రాత్రి కన్నుమూశారు. ఆమె మృతితో తమిళనాడులో అప్పుడే రాజకీయ కుట్రలు మొదలయ్యాయని అంటున్నారు. ఆధిపత్య పోరు ప్రారంభమైంది. ఎత్తులు, పై ఎత్తులు మొదలయ్యాయి.

జయ ఆసుపత్రిలో ఉండగానే పార్టీలో మూడు అధికార కేంద్రాలు నడిచినట్టు ప్రచారం జరిగింది. విశ్రాంత ఐఏఎస్ అధికారి, తమిళనాడు ప్రభుత్వ మాజీ ప్రధాన కార్యదర్శి షీలా బాలకృష్ణన్ పాలనాపరంగా జయ వ్యవహారాలన్నీ చూసేవారు.

జయలలిత సలహాదారు కూడా అయిన ఆమె అధికార యంత్రాంగాన్ని ముందుండి నడిపించారు. ఇక జయ అధికారానికి దూరంగా ఉన్నప్పుడు ఆమెకు అత్యంత విశ్వాసపాత్రుడు అయిన పన్నీరు సెల్వం పగ్గాలు చేపట్టేవారు. జయ పరోక్షంలో రెండుసార్లు ముఖ్యమంత్రిగా పదవీ బాధ్యతలు చేపట్టిన పన్నీరు సెల్వం తాజాగా ఆమె మృతి తర్వాత కూడా సీఎంగా ప్రమాణ స్వీకారం చేశారు.

Now, AIADMK future in BJP hand?

మూడో వ్యక్తి జయలలిత నెచ్చెలి శశికళ. జయ ఆసుపత్రిలో ఉన్నన్ని రోజులూ ఆమె జయ పక్కనే ఉన్నారు. జయ అధికారంలో ఉండగా ఆమె రెండో అధికార కేంద్రంగా వ్యవహరించేవారు. ఇప్పుడు ముఖ్యమంత్రి ఎంపికలోనూ ఆమె కీలకపాత్ర పోషించారు. పన్నీరు సెల్వంను సీఎంగా పార్టీ ఏకగ్రీవంగా ఎన్నుకోవడం వెనక ఆమె హస్తం ఉందని అంటున్నారు.

మరోవైపు, పార్టీలో నెంబర్ 2 లేరు. అన్నీ నిన్నటి దాకా జయలలితనే! ఇప్పుడు పన్నీరు సెల్వం ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టారు. అయితే ఆన బీజేపీతో సన్నిహితంగా ఉంటున్నారే వాదనలు వినిపిస్తున్నాయి. బీజేపీతో స్నేహంగా ఉంటూ రాష్ట్రంలో బలపడాలని భావిస్తున్నారని అంటున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+