తరుముకొస్తున్న మరో భూతం-కరోనాను మించిన మహమ్మారి- ఏ మందూ పనిచేయదట
కరోనా మహమ్మారి ప్రభావంతో ఏడాది నుంచి అల్లాడుతున్న భారతీయులకు శాస్త్రవేత్తలు మరో చేదు వార్త చెప్పారు. కరోనాకే భయపడితే ఎలా దాన్ని మించిన మహమ్మారి రాబోతోంది. ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉండండి.. అది అలాంటి, ఇలాంటి వైరస్ కాదు సూపర్ బగ్. ప్రస్తుతం మనం వాడుతున్న అన్ని వ్యాక్సిన్లను తట్టుకునే సామర్ధ్యం దానికి ఉంది. దేశంలోని మారుమూల ఇసుక తిన్నెల్లో ఇప్పటికే పాగా వేసిన ఈ మహమ్మారి ఓసారి జనంలోకి వస్తే ఇక అంతే సంగతులు అంటున్నారు. దీని లక్షణాలను కూడా తాజాగా ఓ సైన్స్ జర్నల్‌లో వివరించారు.
కరోనా విలయంలో అద్భుతం -కొవిడ్ యాంటీ బాడీస్తో తొలి శిశువు జననం -తల్లి వ్యాక్సిన్ తీసుకోగా

కరోనాను మించిన మహమ్మారి
మన దేశంలో కరోనా సెకండ్ వేవ్ ప్రభావం చూపుతున్న నేపథ్యంలో దీన్ని ఎలా అరికట్టాలా అని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అందోళన చెందుతున్న వేళ తాజాగా శాస్త్రవేత్తలు అఁతకంటే భయంకరమైన నిజాన్ని బయటపెట్టారు. కరోనాను మించిన మహమ్మారి ఆనవాళ్లు మన దేశంలోనే దొరికాయనే విషయాన్ని వెల్లడించారు. ఇది కరోనా కంటే మరింత భయంకరంగా ప్రభావం చూపుతుందని శాస్త్రవేత్తలు చెప్తున్నారు. సూపర్ బగ్‌గా పిలిచే ఈ వైరస్ సోకితే మనిషి ఆనవాళ్లు దొరకడం కూడా కష్టమేనంటున్నారు. దీంతో ఇప్పుడు శాస్త్రవేత్తలు బయటపెట్టిన వివరాలు తీవ్ర కలకలం రేపుతున్నాయి. 2009లో జపాన్‌లో తొలిసారి బయటపడిన దీని ఆనవాళ్లు 2019లో బ్రిటన్లో 270 మందిలో సోకినట్లు తెలుస్తోంది. వీరిలో 8 మంది చనిపోయారు.

ఇసుక తిన్నెల్లో పొంచి ఉన్న ప్రమాదం
దేశంలోని మారుమూల ఉన్న సముద్ర తీర ప్రాంతాల్లోని ఇసుక తిన్నెల్లో 'క్యాండిడా ఆరిస్'గా పిలిచే ఈ మహమ్మారి దాక్కుని ఉన్నట్లు శాస్త్రవేత్తలు గుర్తించారు. ఎం బయో పేరుతో వెలువడే ఓ సైన్స్ జర్నల్‌లో దీనికి సంబంధించిన వివరాలను శాస్త్రవేత్తలు పేర్కొన్నారు. ఈ క్యాండిడా ఆరిస్ ప్రభావం మనుషులపై తీవ్రంగా ఉంటుందని తేల్చారు. ప్రస్తుతం దేశంలో లభిస్తున్న ఫంగస్ వ్యతిరేక చికిత్సలను అన్నింటినీ ఇది తట్టుకోలదని శాస్త్రవేత్తలు అంచనా వేస్తున్నారు, జంతువుల నుంచి మనుషుల్లోకి ప్రవేశించే ఈ వైరస్ ఎలా వ్యాప్తి చెందుతుందన్న దానిపైనా ఆధారాలు లేవని వారు చెప్తున్నారు. మనిషి శరీరంలో ఉండే అత్యధిక ఉష్ణోగ్రతలు కూడా దీనికి అనుకూలంగా ఉంటాయని పేర్కొన్నారు.

కరోనా పరిస్ధితుల్లో వ్యాప్తికి అవకాశం
దేశంలో ప్రస్తుతం వ్యాప్తించి ఉన్న కరోనా పరిస్ధితుల్ని తనకు అనుకూలంగా మల్చుకుని ఈ కొత్త వైరస్ వ్యాప్తి చెందే ప్రమాదం ఉందని శాస్తవేత్తలు పేర్కొంటున్నారు. కరోనా పరిస్ధితుల్లో ఈ వైరస్ వ్యాప్తి కూడా తోడైతే ప్రజలకు చుక్కలు కనిపించడం ఖాయమంటున్నారు. ఢిల్లీ విశ్వావిద్యాలయంలో డాక్టర్ అనూరాధా చౌదరి నేతృత్వంలోని బృందం అండమాన్ దీవుల చుట్టు పక్కల ఉన్న ఎనిమిది సహజ సిద్ధమైన ప్రదేశాల నుంచి సేకరించిన 48 మట్టి, నీటి నమూనాల్లో దీని ఆనవాళ్లను గుర్తించారు. వీటిలో ఇసుక బీచ్‌లతో పాటు రాతి తీరాలు, చిత్తడి నేతలు, మడ అడవులు కూడా ఉన్నాయి.

వచ్చిదంటే చావే, ఏ మందులూ పనిచేయవిక
కొత్తగా బీచ్‌ల్లోని ఇసుక తిన్నెల్లో కనిపిస్తున్న ఈ కొత్త సూపర్ బగ్ క్యాండిడా ఆరిస్ సోకినట్లయితే మనుషులకు ప్రాణాపాయం తప్పదని శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు. ఎందుకంటే ముందుగా ఎలాంటి లక్షణాలు కనిపించకుండా ఒక్కసారిగా జ్వరం, దురదలతో ప్రారంభమై, ఎలాంటి మందులకు, వ్యాక్సిన్లకు లొంగకుండా మనుషుల ప్రాణాలు పోయాకే వారి శరీరాల్ని వీడటం దీని లక్షణమని వారు చెప్తున్నారు.
చాలా సందర్భాల్లో గాయాల ద్వారా చర్మం పైకి ప్రవేశించే ఈ వైరస్ బగ్... ఆ తర్వాత రక్తంలోకి చేరుతుందని గుర్తించారు. అనంతరం సెప్సిస్ గా పిలువబడే ఓ రకమైన ప్రాణాంతక రుగ్మతకు దారి తీస్తుందని శాస్త్రవేత్తలు చెప్తున్నారు. దీని వల్ల ఇప్పటికే ఏటా ప్రపంచవ్యాప్తంగా కోటి మంది చనిపోతున్నట్లు వారు తెలిపారు.