చంద్రుడిపై నాసా భారీ ప్రయోగం: వెళ్లేదీ వీళ్లే.. !!

ఆర్టెమిస్-3 మిషన్ కోసం నలుగురు వ్యోమగాములను నాసా (NASA) అధికారికంగా ప్రకటించింది. భవిష్యత్తులో చంద్రునిపై మనుషులను మళ్లీ దించే ప్రక్రియలో భాగంగా ఈ మిషన్ ను చేపట్టింది. కొద్దిరోజుల కిందటే ఆర్టెమిస్ 2 విజయవంతంగా పూర్తయింది. దీనికి కొనసాగింపుగా తాజా ప్రాజెక్ట్ తెర మీదికి వచ్చింది. ఈ మిషన్ ద్వారా అంతరిక్షంలో కీలకమైన డాకింగ్ ప్రక్రియలను పరీక్షించడంతో పాటు, భవిష్యత్ అన్వేషణలకు అవసరమైన ముఖ్యమైన శాస్త్రీయ సమాచారాన్ని సేకరించనుంది నాసా.

ఈ ప్రతిష్టాత్మక మిషన్ కోసం నలుగురు వ్యోమగాములు ఎంపికయ్యారు. ఈ బృందంలో రాండీ బ్రెజ్నిక్, యూరోపియన్ స్పేస్ ఏజెన్సీకి చెందిన లూకా పార్మిటానో, ఫ్రాంక్ రూబియో, ఆండ్రీ డగ్లస్ ఉన్నారు. వీరందరికీ అంతరిక్ష కేంద్రంలో పని చేసిన సుదీర్ఘ అనుభవం ఉంది. ఈ టీమ్ కు రాండీ బ్రెజ్నిక్ కమాండర్ గా వ్యవహరిస్తారు. లూకా పార్మిటానో పైలట్ గా ఎంపికయ్యారు. ఫ్రాంక్ రూబియో, ఆండ్రీ డగ్లస్.. మిషన్ స్పెషలిస్టుగా పని చేస్తారు.

NASA Unveils Artemis 3 Crew Four Astronauts Ready Test Docking and Crucial Lunar Research Mission

టెక్సాస్‌లోని జాన్సన్ స్పేస్ సెంటర్‌లో జరిగిన మీడియా సమావేశంలో నాసా ఈ వివరాలను వెల్లడించింది. లో- ఎర్త్ ఆర్బిట్ దాటి, అంతరిక్షంలో సుదీర్ఘ కాలం పాటు మిషన్లను విజయవంతంగా నిర్వహించడానికి అవసరమైన కార్యాచరణ సంసిద్ధత, అవసరమైన ప్రణాళికలు, ప్రత్యేక నైపుణ్యాలు ఈ నలుగురు వ్యోమగాములకు ఉందని నాసా పేర్కొంది. 2027లో ఆర్టెమిస్ 3 మిషన్ ను ప్రయోగించనున్నట్లు తెలిపింది.

సుమారు రెండు వారాల పాటు సాగే ఈ మిషన్‌లో.. వ్యోమగాములు లో-ఎర్త్ ఆర్బిట్‌లో వాణిజ్యపరమైన లూనార్ ల్యాండర్లతో అనుసంధానం కావడం, వాటి పనితీరును పరీక్షించడంలో శిక్షణ పొందుతారు. దీనితో పాటు భూ వాతావరణాన్ని, ఓరియన్ అంతరిక్ష నౌక చుట్టూ ఉన్న పరిస్థితులను అధ్యయనం చేయడం కూడా వారికి అప్పగించిన బాధ్యతలలో ఒకటి. చంద్రునిపై మనుషులను పంపడం, అంగారక గ్రహం వైపు అడుగులు వేయడం నాసా ఆర్టెమిస్ ప్రోగ్రామ్ ముఖ్య ఉద్దేశ్యం.

ఇదివరకే ఆర్టెమిస్ 1 నిర్వహించింది నాసా. ఇది మానవ రహిత ప్రయోగం. భౌతికంగా ఎవ్వరూ అంతరిక్షంలోకి వెళ్లలేదీ మిషన్ ద్వారా అప్పట్లో. అది విజయవంతం కావడంతో మొదటి మానవ సహిత మిషన్ ఆర్టెమిస్- 2 ప్రయోగించింది. ఇది మరో అద్భుత విజయాన్ని అందుకుంది. ఆర్టెమిస్ వ్యోమగాములు చంద్రుని చుట్టూ ప్రదక్షిణలు చేశారు. మనం చూడని చంద్రుడి అవతలి వైపు వెళ్లొచ్చారు. అక్కడ సంభవించిన సంపూర్ణ సూర్యగ్రహణాన్ని సైతం రికార్డు చేశారు. ఈ వరుస0 విజయాల నేపథ్యంలో.. ఇప్పుడు ఆర్టెమిస్-3 ని చేపట్టింది నాసా.

ఆర్టెమిస్-3 మిషన్ ను.. భవిష్యత్తులో చంద్రుడిపై స్థిర నివాసం ఏర్పరచుకోవడానికి, తదుపరి అంగారక గ్రహ ప్రయోగాలకు ఓ ప్రాథమిక పరీక్షగా నాసా అభివర్ణిస్తోంది. ఆర్టెమిస్-3 మిషన్ విజయవంతమైతే, 2028లో చంద్రునిపై మనుషులను దించే ఆర్టెమిస్- 4 మిషన్‌కు ఇది బంగారు బాటలు వేసినట్టవుతుందని అభిప్రాయపడుతోంది. ఈ ప్రాజెక్టులో ప్రైవేట్ సంస్థల భాగస్వామ్యం కీలకంగా మారింది. బ్లూ ఆరిజిన్ (Blue Origin) తన 'బ్లూ మూన్' ల్యాండర్ నమూనాను పరీక్షించనుంది. అలాగే స్పేస్‌ఎక్స్ (SpaceX) తన స్టార్‌షిప్ హ్యూమన్ ల్యాండింగ్ సిస్టమ్‌ను ప్రదర్శించనుంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+