కొహ్లీ బాటలో హార్దిక్ పాండ్యా..! టీమిండియాకు మరో షాక్..!
వచ్చే ఏడాది వన్డే వరల్డ్ కప్ కు సిద్ధమవుతున్న టీమిండియాను కష్టాలు చుట్టుముడుతూనే ఉన్నాయి. త్వరలో ఆఫ్ఘనిస్తాన్‌తో జరిగే మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్‌కు ముందు టీమిండియాకు మరో ఎదురుదెబ్బ తగిలింది. దక్షిణాఫ్రికా వేదికగా జరగనున్న 2027 వన్డే ప్రపంచ కప్‌కు సన్నాహాలను ప్రారంభించే ఈ సిరీస్ నుంచి ఇప్పటికే స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ తప్పుకోగా.. ఇప్పుడు హార్దిక్ పాండ్యా (Hardik Pandya) కూడా అదే బాట పట్టాడు.
తొడ కండరాల గాయంతో బాధపడుతున్న హార్దిక్ పాండ్యా.. ఆప్ఘనిస్తాన్ తో వన్డే సిరీస్ కు అందుబాటులో ఉండే అవకాశం లేకుంటా పోయింది. హార్దిక్ గాయం నయం కావడానికి మూడు వారాల సమయం పడుతుందని బీసీసీఐ వర్గాలు తెలిపాయి. ఐపీఎల్ 2026లో ముంబై ఇండియన్స్ తరపున ఆడుతున్నప్పుడు పాండ్యాకు ఈ గాయమైంది. ఆ టోర్నమెంట్‌లో ముంబై ఇండియన్స్ కెప్టెన్ కేవలం 10 మ్యాచ్‌లు మాత్రమే ఆడాడు. లీగ్ దశ చివరి మ్యాచ్‌లకు జట్టుకు దూరంగా ఉన్నాడు.

మరోవైపు విరాట్ కోహ్లీ ఇప్పటికే ఆప్ఘన్ తో వన్డే సిరీస్ కు దూరమయ్యాడు. ఇలాంటి సమయంలో పాండ్యా గాయం జట్టుపై ప్రభావం చూపనుంది. గుజరాత్ టైటాన్స్‌తో జరిగిన ఐపీఎల్ ఫైనల్‌లో బ్యాటింగ్ చేస్తున్నప్పుడు హ్యామ్‌స్ట్రింగ్ గాయానికి గురైన భారత స్టార్ బ్యాటర్ కోహ్లీ, ఇప్పటికే జట్టుకు దూరమయ్యాడు. కోహ్లీతో పాటు, ఐపీఎల్ సమయంలో ఫిట్‌నెస్ సమస్యలతో ఇబ్బంది పడిన మాజీ భారత కెప్టెన్ రోహిత్ శర్మ అందుబాటుపై కూడా అనిశ్చితి నెలకొంది. కోహ్లీ స్థానంలో యశస్వి జైస్వాల్‌ను తీసుకున్నప్పటికీ, హార్దిక్ పాండ్యా స్థానంలో ఎవరిని తీసుకుంటారనే దానిపై బీసీసీఐ నిర్ణయం తీసుకోవాల్సి ఉంది.













Click it and Unblock the Notifications