2027 ప్రపంచ కప్ లో ఆడటం పై విరాట్ సంచలన నిర్ణయం..!!

విరాట్ కోహ్లీ సంచలన వ్యాఖ్యలు చేసారు. ఐపీఎల్ 2026 చివరి దశకు చేరుకుంది. విరాట్ తన ఆర్సీబీ టీం ను ప్లే ఆఫ్స్ కు తీసుకెళ్లటమే లక్ష్యంగా తన బ్యాట్ తో వీర విహారం చేస్తున్నారు. ఇదే సమయంలో 2027 వన్డే ప్రపంచ కప్ లో ఆడటం పైన విరాట్ మౌనం వీడారు. అసలు విరాట్ ఆడుతారా లేదా అనేది దానికి ఊహించని రీతిలో సమాధానం ఇచ్చారు. ఆర్సీబీని మరోసారి గెలిపించటమే తన లక్ష్యమని చెప్పిన విరాట్.. 2027 ప్రపంచ కప్ గురించి ఆసక్తి కర వ్యాఖ్యలు చేసారు.

2027 ప్రపంచ కప్ లో ఆడటం పైన విరాట్ కోహ్లీ సంచలన వ్యాఖ్యలు చేసారు. ఇప్పటికే విరాట్ టెస్టు, టీ20 ఫార్మాట్ క్రికెట్‌కు వీడ్కోలు చెప్పారు. 2027 వన్డే ప్రపంచ కప్ గెలవడమే లక్ష్యంగా శ్రమిస్తున్నట్లు పలుమార్లు వెల్లడించాడు. అయితే విరాట్ వన్డే ప్రపంచ కప్‌లో ఆడుతాడా? లేదా? అని చాలాకాలంగా చర్చ నడుస్తోంది. ఈ నేపథ్యంలో కోహ్లీ సంచలన వ్యాఖ్యలు చేశాడు. తన సామర్థ్యాన్ని పదేపదే నిరూపించుకోవాల్సిన పరిస్థితే వస్తే అలాంటి వాతావరణంలో తాను ఉండబోనని స్పష్టం చేశాడు. జట్టుకు తన అవసరం ఉందని మేనేజ్‌మెంట్ భావించాలని, తాను కూడా జట్టుకు ఉపయోగపడగలని నమ్మితేనే ఆడతానని తేల్చి చెప్పారు. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఫ్రాంచైజీ చేసిన ఓ ఇంటర్వ్యూలో విరాట్ మాట్లాడాడు. తన అవసరం జట్టుకు ఉందని మేనేజ్‌మెంట్ భావిస్తేనే ఆడతానని... కానీ, ప్రతిసారీ నా విలువను నిరూపించుకోవాలని అడిగే పరిస్థితులను నేను కోరుకోవడం లేదని స్పష్టం చేసారు.

PBKS ఓటమితో ప్లే ఆఫ్స్ రేసులో బిగ్ ట్విస్ట్ - ఇక, ఈ టీంలకే ఛాన్స్..!!
PBKS ఓటమితో ప్లే ఆఫ్స్ రేసులో బిగ్ ట్విస్ట్ - ఇక, ఈ టీంలకే ఛాన్స్..!!
virat-kohli-has-finally-broken-his-silence-around-the-constant-speculation-over-playing-the-2027-od

తేల్చి చెప్పిన విరాట్ కోహ్లీ

అలాంటి వాతావరణంలో తాను ఉండలేనని.. క్రికెట్ కోసం నిజాయతీగా కష్టపడుతూనే ఉంటానని కోహ్లీ వెల్లడించారు. ఒక వన్డే మ్యాచ్‌లో 40 ఓవర్లు బౌండరీకి పరుగెత్తమంటే కూడా తనకు ఎలాంటి ఇబ్బంది లేదని చెప్పారు. ప్రతి మ్యాచ్‌కు ముందు అన్ని విధాలుగా సిద్ధమయ్యాకే మైదానంలోకి దిగుతానని... ప్రతి బంతిని కెరీర్‌లో చివరి బంతిలా భావించి ఆడతానని విరాట్ వెల్లడించాడు. అంతర్జాతీయ క్రికెటర్లు దేశవాళీల్లోనూ ఆడాలని బీసీసీఐ నిబంధన కారణంగా విరాట్ కోహ్లీ ఇటీవల విజయ్ హజారే ట్రోఫీలో ఢిల్లీ తరఫున ఆడిన విషయాన్ని ఈ సందర్భంగా గుర్తు చేసుకున్నారు. 'నాకు ఎవరికీ ఏం నిరూపించాల్సిన అవసరం లేదు. నేను క్రికెట్‌ను ప్రేమించి ఆడుతున్నాను. దేశవాళీల్లో ఆడటంతో మళ్లీ నాకు బాల్యం గుర్తొచ్చింది. ఒకరోజు బాగా ఆడావని ప్రశంసిస్తారు. ఫామ్ లేమితో ఇబ్బంది పడుతున్నప్పుడు విమర్శించడానికి సిద్ధంగా ఉంటారు. ఇది ప్లేయర్ల స్థిరత్వంపై ప్రభావం పడుతుంది. నేను ఇంకా ఆడుతున్నానంటే.. నాకు క్రికెట్ ఆడాలనే కోరిక ఉంది కాబట్టే. భారత్ కోసం ప్రపంచ కప్ ఆడటం గొప్ప విషయం. కానీ దీనికి రెండు వైపులా విలువ ఉండాలి. జట్టుకు నా అవసరం లేదనుకుంటే మొదటి రోజే చెప్పండి. లేదంటే మౌనంగా నా పని నన్ను చేసుకోనివ్వండి' అంటూ విరాట్ చేసిన వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+