ఇంట్లోనుంచి ఈడ్చుకెళ్లి యువతిపై చెరకు తోటలో గ్యాంగ్‌రేప్
మీరట్: ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో యువతులు, మహిళలపై దారుణాలు కొనసాగుతూనే ఉన్నాయి. ఇటీవలే కారులో వెళుతున్న ఓ కుటుంబంపై దాడి చేసి దోపిడీకి పాల్పడిన దుండగులు.. కారులోని తల్లీకూతుళ్లపై సామూహిక అత్యాచారానికి పాల్పడిన విషయం తెలిసిందే.
తాజాగా, మరో యువతి సామూహిక అత్యాచారానికి గురైంది. పోలీసుల కథనం ప్రకారం.. బులంద్‌షార్‌కు 40కి.మీల దూరంలోని హాపుర్ జిల్లా డోమి గ్రామంలో ఈ ఘటన చోటు చేసుకుంది.

కాస్మోటిక్స్ కంపెనీలో సేల్స్‌గర్ల్‌గా పనిచేసే 23ఏళ్ల యువతి ఇంట్లోకి బుధవారం రాత్రి ఇద్దరు దుండగులు చొరబడ్డారు. ఇంట్లో ఉన్న రూ.5వేలు దోచుకున్నారు.
అనంతరం యువతిని ఇంటికి సమీపంలో ఉన్న చెరకు తోటలోకి లాక్కెళ్లి సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. బాధితురాలి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.












Click it and Unblock the Notifications