వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఏటీఎం వద్దు: పెట్రోల్ బంకుల్లో రూ. 2 వేలు తీసుకోండి

|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: నగదు డ్రా చేసుకోవడానికి బ్యాంకులు, ఏటీఎంల ముందు ఇన్ని రోజులు క్యూలో నిలబడి సమస్యలు ఎదుర్కొన్న ప్రజలకు ఇక ముందు పెట్రోల్ బంకుల్లో నగదు డ్రా చేసుకోవడానికి అవకాశం ఇచ్చారు.

దేశంలోని వివిధ చోట్ల ఉన్న 2,500 పెట్రోల్ బంకుల్లో నగదు విత్ డ్రా చేసుకోవడానికి కేంద్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ప్రజలు డెబిట్ కార్డు లేదా క్రెడిట్ కార్డు స్వైప్ చెయ్యడం ద్వారా రోజుకు రెండు వేల రూపాయలు విత్ డ్రా చేసుకునేందుకు కేంద్ర ప్రభుత్వం అనుమతి ఇచ్చింది.

స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్ బీఐ) పార్చుంట్ ఆఫ్ సేల్ (పీఓఎస్) మెషిన్లను ఇప్పటికే ఎంపిక చేసిన 2,500 పెట్రోల్ బంకుల్లో అందుబాటులో ఉంచామని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. ఒక వ్యక్తి రోజుకు రూ. 2 వేల వరకూ నగదు పొందవచ్చని కేంద్ర ప్రభుత్వం ఓ ప్రకటనలో స్పష్టం చేసింది.

Now petrol pumps will also dispense 2,000 cash per person per day,

అదే విధంగా మరో మూడురోజుల్లో పెట్రోల్ బంకుల్లో రూ. 20 వేల వరకూ తీసుకోవడానికి అవకాశం కల్పిస్తామని కేంద్ర ప్రభుత్వం తెలిపింది. పెట్రోల్ బంకుల్లో నగదు డ్రా చేసుకోవడానికి అవకాశం రావడంతో ప్రజలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

English summary
Now petrol pumps will also dispense 2,000 cash per person per day, state-run Doordarshan announced in a tweet on Thursday.Cash to be dispensed at 2,500 petrol pumps; Cash to be given by swiping of debit/credit card via POS (Point of Sale) machine.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X