కోలుకున్న మూడునెలలకే టీకా- టెస్టుల్లేకుండానే-పాలిచ్చే తల్లులకూ-కేంద్రం నిర్ణయాలు
కరోనా నుంచి కోలుకున్న మూడు నెలల తర్వాత టీకా తీసుకోవాలని కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది. జాతీయ టీకా నిపుణుల కమిటీ ప్రతిపాదనలకు కేంద్రం ఆమోదం తెలిపింది. తొలి డోసు తర్వాత కరోనా వస్తే మూడు నెలలకు రెండో డోసు వేయించుకోవాలని సూచించింది. తీవ్రంగా జబ్బుపడి కోలుకున్న వారికి 4-8 వారాల తర్వాతే టీకా ఇవ్వనున్నట్లు తెలిపింది. వ్యాక్సిన్ తీసుకున్న 14 రోజుల తర్వాత, ఆర్‌టీపీసీఆర్ నెగటివ్ వచ్చిన రెండు వారాల తర్వాత రక్తదానం చేయవచ్చని వెల్లడించింది. వ్యాక్సినేషన్‌కు ముందు కరోనా నిర్థరణ అక్కర్లేదని కేంద్రం స్పష్టం చేసింది.

కోలుకున్న మూడు నెలల తర్వాతే టీకా
కరోనా నుంచి కోలుకున్న రోగులకు మూడు నెలల తర్వాతే టీకా తీసుకోవాలని కేంద్ర ప్రభుత్వం ఇవాళ సూచించింది. ఈ మేరకు కరోనాపై పోరు కోసం నియమించిన జాతీయ నిపుణుల బృందం చేసిన సిఫార్సులను కేంద్రం ఆమోదించింది. కరోనా వ్యాక్సిన్ మొదటి డోస్ తీసుకున్నాక వైరస్ బారిన పడితే కోలుకున్న మూడు నెలల తర్వాతే తిరిగి వ్యాక్సిన్ రెండో డోస్ తీసుకోవాలని కేంద్రం సూచించింది. దీంతో వ్యాక్సిన్ ఎప్పుడు తీసుకోవాలన్న దానిపై కేంద్రం పూర్తి స్పష్టత ఇచ్చినట్లయింది.

వ్యాక్సినేషన్‌కు ముందు టెస్టు అక్కర్లేదు
కరోనా వ్యాక్సిన్ వేయించుకునే ముందు కరోనా పరీక్షలు చేయించుకోవాల్సిన అవసరం లేదని కేంద్రం మరో క్లారిటీ ఇచ్చింది. ప్రస్తుతం వ్యాక్సిన్ వేయించుకోవాలంటే ముందుగా కరోనా ఉందో లేదో పరీక్షించుకోవాలన్న డిమాండ్ పెరుగుతున్న నేపథ్యంలో ఎలా్ంటి టెస్టులూ అక్కర్లేదని కేంద్రం స్పష్టత ఇచ్చింది. దీంతో కరోనా వ్యాక్సిన్ మొదటి డోస్ లేదా రెండో డోస్ తీసుకునే ముందు టెస్టులు చేయించుకోవాల్సిన అవసరం తప్పింది.

పాలిచ్చే తల్లులకూ వ్యాక్సిన్
ఇకపై పాలిచ్చే మహిళలందరికీ టీకాలు వేయాలని నిపుణుల ప్యానెల్ కేంద్రానికి సిఫారసు చేసింది. జనాభా సమూహాల ప్రాధాన్యత, సేకరణ మరియు జాబితా నిర్వహణ, వ్యాక్సిన్ ఎంపిక, వ్యాక్సిన్ డెలివరీ మరియు ట్రాకింగ్ విధానంపై నిపుణుల ప్యానెల్ నెగ్‌వ్యాక్ ప్రభుత్వానికి అవసరమైన సలహాలు సూచనలు అందిస్తోంది. మరోవైపు జనవరిలో వ్యాక్సిన్ డ్రైవ్ ప్రారంభమైనప్పటి నుండి ఇప్పటివరకు 18.57 కోట్లకు పైగా వ్యాక్సిన్లు ఇచ్చారు. 36 రాష్ట్రాలు మరియు కేంద్రపాలిత ప్రాంతాలలో 18-44 సంవత్సరాల మధ్య వయస్సు గల 64,60,624 మంది లబ్ధిదారులు మే 1 న టీకా డ్రైవ్ మూడవ దశ ప్రారంభమైనప్పటి నుండి తమ మొదటి డోస్ తీసుకున్నారని ఆరోగ్య మంత్రిత్వ శాఖ ఇవాళ వెల్లడించింది.
-
ఈ రాత్రికి ఆయనొక్క మాట చెబితే చాలు.. బంగారం తలకిందులే! -
కుంభరాశి వారికి ఉగాది నుండి జరిగేదిదే! -
ఇరాన్ వార్ నుంచి తప్పుకుంటాం కానీ..! ఎదురుదెబ్పల వేళ ట్రంప్ సంకేతం..! -
60 ఏళ్ల క్రితం ఏం జరిగింది? పరాభవ నామ సంవత్సరం.. పేరులోనే కీడు? -
తీవ్ర సంక్షోభంలో పాకిస్తాన్- ప్రధాని షరీఫ్ అనూహ్య ఆదేశాలు -
Tenth Exams: కన్నీళ్లు తెప్పిస్తున్న దృశ్యం. ఆక్సిజన్ సాయంతో పరీక్ష రాసిన విద్యార్ధి -
H-1B Visa ఫీజు వ్యవహారం భారీ ట్విస్ట్- బ్యాక్ ఫైర్ -
ఐటెం సాంగ్ బ్యాన్ చేసిన కేంద్రం, పాన్ ఇండియా మూవీకి బిగ్ షాక్ -
రేవంత్ గుడ్ న్యూస్: 'కల్యాణ లక్ష్మి' సాయం పెంపు, రూ.2,016 పెన్షన్ ఇక నుంచి..!! -
`ఉస్తాద్` కోసం పవన్ రెమ్యునరేషన్ -
యుద్ధం వేళ.. మోదీ మంత్రివర్గం సంచలన నిర్ణయాలు -
బంగారం కొనేందుకు ఇదే మంచి సమయం.. ఉగాది తర్వాత












Click it and Unblock the Notifications