Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

NRI wife: అబ్బా.... ఎంతపని చేసింది, లాడ్జ్ లో ?, నిన్న మొగుడు, నేడు ప్రియుడు, హైటెక్ స్కెచ్ !

బెంగళూరు/ఉడిపి: జ్యోతిష్యుడితో అక్రమ సంబంధం కొనసాగించిన ఆంటీ ప్రియుడి వ్యామోహంలో తేలిపోయింది. కట్టుకున్న భర్తను చులకన చేసింది. NRI అయిన ఆమె మొగుడు ప్రముఖ వ్యాపారవేత్త. ప్రియుడితో కలిసి ఎన్ఆర్ఐ మొగుడిని దారుణంగా హత్య చేసి హోమంలో శవాన్ని వేసి కాల్చి బూడిదచేసి జైలుపాలైయ్యింది. గ్రహాలు అనుకూలించకపోవడంతో సొంత లాడ్జ్ లో హైటెక్ వ్యభిచారం చేయిస్తున్న ఆ అంటీ అదే వ్యభిచారం కేసులో మరోసారి చిక్కుకోవడం కలకలం రేపింది. హత్యకు గురైన ఎన్ఆర్ఐ వ్యాపారవేత్త భార్య హైటెక్ వేశ్యవాటిక కేంద్రం నిర్వహిస్తున్నదని వెలుగు చూడటంతో అబ్బా..... ఎంతపని చేసింది అని ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. ఈ కేసు నుంచి తప్పించుకోవాలని ఆమె పారిపోవడం హాట్ టాపిక్ అయ్యింది.

 ఎన్ఆర్ఐ మొగుడు

ఎన్ఆర్ఐ మొగుడు

ప్రముఖ వ్యాపారవేత్త, ఎన్ఆర్ఐ అయిన భాస్కర్ శెట్టికి బెంగళూరు, కర్ణాటకలోని ఉడిపితో పాటు అనేక ప్రాంతాల్లో కోట్ల రూపాయల విలువైన ఆస్తులు ఉన్నాయి. ఎన్ఆర్ఐ అయిన భాస్కర్ శెట్టి 2016 జులై 28వ తేదీన దారుణ హత్యకు గురైనాడు. భాస్కర్ శెట్టి హత్య తరువాత ఆయనకు చెందిన ఆస్తులు దాదాపుగా ఆయన భార్య రాజేశ్వరి శెట్టి చేతిలోకి వెళ్లిపోయాయి.

 హైటెక్ వేశ్యవాటిక

హైటెక్ వేశ్యవాటిక

ఉడిపిలో ఎన్ఆర్ఐ భాస్కర్ శెట్టి భార్య రాజేశ్వరి శెట్టి లాడ్జ్ లో (ఫేమస్ హోటల్స్) నిర్వహిస్తోంది. రాజేశ్వరి శెట్టికి చెందిన హోటల్ లో గుట్టుచప్పుడు కాకుండా హైటెక్ వ్యభిచార కేంద్రం నిర్వహిస్తున్నారని పోలీసులకు పక్కా సమాచారం అందింది. కచ్చితమైన సమాచారం అందడంతో పోలీసులు ఆ లాడ్జ్ లోకి ఎంట్రీ ఇచ్చారు.

 త్రిమూర్తులు అందర్

త్రిమూర్తులు అందర్

భాస్కర్ శెట్టి భార్య రాజేశ్వరి శెట్టి నిర్వహిస్తున్న లాడ్జ్ లో హైటెక్ వ్యభిచారం నిర్వహిస్తున్నారని గుర్తించిన పోలీసులు శేఖర్ శెట్టి, జాన్సన్ డి అల్మేడా, హర్షిత్ శెట్టి అనే ముగ్గురిని అరెస్టు చేశారు. బలవంతంగా హైటెక్ వేశ్యవాటిక కేంద్రంలో ఉన్న కొందరు యువతులు, వివాహిత మహిళలను పోలీసులు రక్షించి మహిళా శిశు సంక్షేమ శాఖ భవనానికి తరలించారు.

 ఆంటీకి అయిల్ ఫుడ్

ఆంటీకి అయిల్ ఫుడ్

హైటెక్ వ్యభిచార కేంద్రం నిర్వహిస్తున్నారని నమోదైన కేసులో ఎన్ఆర్ఐ వ్యాపారవేత్త భాస్కర్ శెట్టి భార్య రాజేశ్వరి శెట్టి మీద పోలీసులు కేసు నమోదు చెయ్యడం కలకలం రేపింది. హైటెక్ వ్యభిచార కేంద్రంలో రాజేశ్వరి శెట్టి పరార్ కావడంతో ఉడిపి ప్రజలు ఉలిక్కిపడ్డారు. ఈ హైటెక్ వ్యభిచారం కేసులో రాజేశ్వరి శెట్టితో పాటు మరో ముగ్గురిని అరెస్టు చెయ్యడానికి పోలీసులు రంగం సిద్దం చేస్తున్నారు.

 పగలు ప్రియుడు.... రాత్రి ఎన్ఆర్ఐ మొగుడు

పగలు ప్రియుడు.... రాత్రి ఎన్ఆర్ఐ మొగుడు

కర్ణాటకలోని ఉడిపికి చెందిన భాస్కర్ శెట్టి ప్రముఖ వ్యాపారవేత్త. వ్యాపారవేత్త భాస్కర్ శెట్టి NRI. భాస్కర్ శెట్టికి భార్య రాజేశ్వరి శెట్టి, నవనీత్ శెట్టి అనే కొడుకు ఉన్నాడు. ప్రముఖ జ్యోతిష్యుడు నిరంజన్ భట్ తో ఎన్ఆర్ఐ భాస్కర్ శెట్టి ఫ్యామిలీకి సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. ఇదే సమయంలో జ్యోతిష్యుడు నిరంజన్ భట్ తో కలిసే నెపంతో రాజేశ్వరి శెట్టి అతనితో అక్రమ సంబంధం పెట్టుకునింది.

పగలు జ్యోతిష్యుడితో రాత్రి ఎన్ఆర్ఐ మొగుడితో రాజేశ్వరి శెట్టి చాలా కాలం గుట్టుచప్పుడు కాకుండా ఎంజాయ్ చేసింది.

 మొగుడిని చంపేసి హోమంలో శవం కాల్చేసింది

మొగుడిని చంపేసి హోమంలో శవం కాల్చేసింది

ప్రియుడు నిరంజన్ భట్ వ్యామోహంలో మునిగితేలిన రాజేశ్వరి శెట్టి ఓ సారి జ్యోతిష్యుడితో రాసలీలలు సాగిస్తూ భర్త భాస్కర్ శెట్టికి అడ్డంగా చిక్కిపోయింది. భర్త వార్నింగ్ ఇవ్వడంతో రాజేశ్వరి శెట్టి రగిలిపోయింది. 2016 జులై 28వ తేదీని భర్త భాస్కర్ శెట్టిని భార్య రాజేశ్వరి శెట్టి, ఆమె ప్రియుడు నిరంజన్ భట్ తదితరులు కలిసి అతన్ని దారుణంగా చంపేశారు. భాస్కర్ శెట్టి శవం కూడా చిక్కకుండా చెయ్యాలని జ్యోతిష్యుడు నిరంజన్ భట్, భార్య రాజేశ్వరి శెట్టి తదితరులు కలిసి హోమంలో శవం వేసి కాల్చి బూడిద చేసేశారు.

 హత్య కేసులో కిలాడీకి బెయిల్

హత్య కేసులో కిలాడీకి బెయిల్

ఎన్ఆర్ఐ భాస్కర్ శెట్టి హత్య కేసులో అతని భార్య రాజేశ్వరి శెట్టి, ప్రియుడు నిరంజన్ భట్, మేడమ్ కొడుకు నవనీత్ శెట్టి తదితరులను అరెస్టు చేసి జైలుకు పంపించారు. తరువాత బెయిల్ మీద బయటకు వచ్చిన రాజేశ్వరి శెట్టి భర్త భాస్కర్ శెట్టి ఆస్తులు కొన్ని స్వాధీనం చేసుకుని ఎంజాయ్ చేస్తోంది. ఈ రోజు సొంత లాడ్జ్ లో హైటెక్ వేశ్యవాటిక కేంద్రం నిర్వహిస్తున్న కేసులో మరోసారి జైలుకు వెళ్లడానికి రాజేశ్వరి శెట్టి సిద్దం అయ్యింది. ఈ కేసులో రాజేశ్వరి శెట్టి కోసం పోలీసులు గాలిస్తున్నారు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+