ఢిల్లీ తర్వాత హైదరాబాద్‌లోనే: అజిత్ దోవల్‌తో యాంగ్ జీచి భేటీ

హైదరాబాద్‌: భారత జాతీయ భద్రతా సలహాదారు అజిత్‌ దోవల్‌ శుక్రవారం చైనా భద్రతా సలహాదారు యాంగ్‌ జీచిని హైదరాబాద్‌లో సమావేశమయ్యారు. వివిధ అంశాల్లో విభేదాల మూలంగా దెబ్బతిన్న ద్వైపాక్షిక సంబంధాలను మెరుగుపరుచుకోవటానికి తీసుకోవాల్సిన చర్యలపై ఈ సందర్భంగా చర్చించినట్టు తెలుస్తోంది.

అణు సరఫరాదారుల బృందంలో భారత్‌ చేరికను, జైషే మహ్మద్‌ అధినేత మసూద్‌ అజర్‌పై ఐక్యరాజ్యసమితి నిషేధం విధించటాన్ని చైనా అడ్డుకోవటం వంటివి ప్రస్తావనకు వచ్చినట్టు సమాచారం.

NSA Ajit Doval

లఢఖ్‌లో సాగునీటి కాలువ నిర్మాణాన్ని చైనా సైన్యం అడ్డుకున్న రెండు రోజుల తర్వాత వీరి భేటీ జరగటం గమనార్హం. అయితే దీని గురించి అధికారికంగా ఎలాంటి సమాచారం లేదు. దేశ రాజధాని వెలుపల విదేశీ ప్రతినిధుల మధ్య ఇలాంటి కీలక భేటీ జరగటం ఇదే తొలిసారి కావడం గమనార్హం.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+