మహిళలు జర భద్రం..వణికిస్తోన్న నగ్న ముఠా..!!

ఉత్తర్ ప్రదేశ్‌ రాష్ట్రం ప్రతిరోజు వార్తల్లో నిలుస్తుంది. అయితే అక్కడ మంచి కంటే చెడు సంఘటనలే ఎక్కువగా వెలుగులోకి వస్తున్నాయి. ఇప్పటి వరకు అక్కడ జరిగే క్రైమ్ వార్తల గురించి విన్నాం. వివిధ మార్గాల్లో అసలు ట్రేస్ ఔట్ కాని నేరాలు ఉత్తర్ ప్రదేశ్‌లో చోటు చేసుకుంటున్నాయి. లూటీల నుంచి అత్యాచారాలు, హత్యల వరకు చాలా ఘటనలు ఇటీవలి కాలంలో చూశాం. తాజాగా మరోసారి ఉత్తర్ ప్రదేశ్ రాష్ట్రం దేశం దృష్టిని ఆకర్షించింది. ఈసారి కూడా మంచి వార్తతో కాదు.. చెడు సంఘటనతోనే. ఇంతకీ ఏం జరిగిందో తెలుసుకుందాం.

పొలాల్లో న్యూడ్ గ్యాంగ్..
ఉత్తర్ ప్రదేశ్ రాష్ట్రం నేరాలకు ఘోరాలకు కేరాఫ్ అడ్రస్‌గా నిలుస్తోంది. తాజాగా ఆ రాష్ట్రంలోని మీరట్ జిల్లాలో జరిగి ఒక ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. మీరట్ జిల్లాలోని దౌరాలా గ్రామంలో నగ్నంగా కొందరు పురుషులు తిరుగుతున్నారు. వారినే న్యూడ్ గ్యాంగ్‌గా పోలీసులు చెప్తున్నారు. ఈ గ్యాంగ్‌లో ఉన్న వ్యక్తులు పొడవాటి జుట్టుని కలిగి ఉంటారు. నగ్నంగా ఉంటారు. వీరంతా దట్టంగా ఉన్న పంట పొలాల్లో మాటేసి ఉంటారు.ఆ పొలాలకు సమీపంలో ఎవరైనా మహిళ ఒంటరిగా నడుచుకుంటూ వెళుతుంటే చాలు.. ఒక్కసారిగా ఆ మహిళలను దట్టమైన పొలాల్లోకి లాక్కెళుతారు. అత్యాచారం చేస్తారు. దీంతో ఆ గ్రామ మహిళలు, స్థానికులు భయాందోళనలకు గురవుతున్నారు.

nude-gang-terrorizes-women-in-uttar-pradesh-police-launch-manhunt

మహిళను పంటపొలాల్లోకి లాక్కెళ్లి..
రెండ్రోజులు క్రితం ఓ పనిమీద దౌరాల గ్రామం నుంచి మరో చోటికి వెళుతున్న మహిళపై ఈ న్యూడ్ గ్యాంగ్ దాడి చేసిందని దౌరాలా గ్రామానికి చెందిన వ్యక్తి ఒకరు చెప్పారు. భారాలా గ్రామం వద్ద పంటపొలాల దగ్గరికి ఆ మహిళ చేరుకోగానే ఒక్కసారిగా ఆమెపై నగ్నంగా ఉన్న ఇద్దరు వ్యక్తులు దాడి చేసినట్లు గ్రామస్తుడు వెల్లడించాడు.అయితే ఆ మహిళ ధైర్యం చేసి గట్టిగా అరవడం మొదలు పెట్టిందని ఎవరైనా సహాయం చేయాల్సిందిగా కేకలు పెట్టినట్లు వివరించారు. కేకలు విన్న చుట్టుపక్కల వారు ఆ పంటపొలాలను చుట్టుముట్టారు. ఇది గమనించిన నిందితులు అమ్మాయిని వదిలి పారిపోయారని గ్రామస్తుడు తెలిపాడు.

ఇళ్ల నుంచి బయటకు రావాలంటే భయం..
అయితే ఇలాంటి ఘటన చోటు చేసుకోవడం ఇది తొలిసారి కాదని అంతకుముందే ఇలాంటి సంఘటనలు నాలుగు జరిగాయని గ్రామస్తులు వెల్లడించారు. అయితే ఘటనకు సంబంధించిన వివరాలను బయటకు చెప్పేందుకు ఆ మహిళలు భయపడ్డారని పోలీసులు వెల్లడించారు. ప్రస్తుతం దౌరాలా, భారాలా గ్రామంలో నివసిస్తున్న మహిళలు బయటకు రావాలంటే భయపడిపోతున్నారని ఆ గ్రామ సర్పంచ్ వెల్లడించారు. ఫిర్యాదు అందుకున్న పోలీసులు నిందితుల కోసం ముమ్మరంగా గాలిస్తున్నారు.సెర్చ్ ఆపరేషన్‌లో భాగంగా డ్రోన్లను సైతం వినియోగిస్తున్నారు.అయితే ఇప్పటి వరకు న్యూడ్ గ్యాంగ్ వ్యక్తులకు సంబంధించి ఎలాంటి ఆధారాలు సేకరించలేకపోయారు.

ఈ రెండు గ్రామాల్లో సీసీ టీవీలను ఏర్పాటు చేయడమే కాకుండా మహిళా కానిస్టేబుళ్లను కూడా అక్కడ ఉండేలా చర్యలు తీసుకున్నట్లు సమాచారం. అయితే న్యూడ్ గ్యాంగ్‌ అంటూ ఎవరూ లేరని కొందరు అల్లరి మూకలు ఇలాంటి చర్యలకు పాల్పడుతుండొచ్చని పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. పోలీసులకున్న మంచి పేరును చెడగొట్టేందుకే కొందరు ఇలాంటి పనులకు పాల్పడుతూ గ్రామస్తుల్లో భయాన్ని సృష్టించే ప్రయత్నం చేస్తున్నారని పోలీసులు అనుమానం వ్యక్తం చేశారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+