ప్రియుడి పొందు కోసం నర్సు దురాగతం: బాత్రూంలో మహిళల వీడియోలు తీసి పంపింది, అతడు..

బెంగళూరు: ప్రియుడి పొందు కోసం ఓ మహిళ సభ్యసమాజం తలదించుకునే పనిచేసింది. నర్సుగా పనిచేసే ఆ మహిళ.. తన ప్రియుడికి తోటి ఉద్యోగిణిలు స్నానం చేస్తుండగా వీడియోలు తీసి పంపింది. చివరకు ఆమె పాపం పండి కటకటాలపాలైంది. ఈ ఘటన కర్ణాటకలోని బెంగళూరులో చోటు చేసుకుంది.

రాంగ్‌కాల్ తో పరిచయం

రాంగ్‌కాల్ తో పరిచయం

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. బెంగళూరుకు చెందిన నర్సు అశ్వినికి ఓ రాంగ్ కాల్ ద్వారా తమిళనాడు వెల్లూరుకు చెందిన ప్రభు అనే చెఫ్‌తో పరిచయం ఏర్పడింది. ఆ పరిచయం ప్రేమగా మారింది. ఆ తర్వాత రెండు మూడు సార్లు కలుసుకున్నారు కూడా.

అసలు బండారం తెలియడంతో..

అసలు బండారం తెలియడంతో..

అయితే, ఆమెకు ఇదివరకే రెండు సార్లు వివాహమైందని, విడాకులు కూడా తీసుకుందని ప్రభుకు తెలిసింది. దీంతో అతడు ఆమెను దూరం పెడుతున్నాడు. ఈ క్రమంలో అతడ్ని దూరం చేసుకోలేని ఆమె.. అతడు ఏది చెబితే అది చేసింది. ఆమెకు సంబంధించిన అభ్యంతరకర వీడియోలు పంపాలని కోరడంతో పలుమార్లు పంపింది.

సహోద్యోగుల బాత్రూం వీడియోలు తీసి..

సహోద్యోగుల బాత్రూం వీడియోలు తీసి..

అయితే, ఆ వీడియోలు తనకు బోర్ కొడుతున్నాయని ప్రభు చెప్పడంతో.. ఆమె తన తోటి ఉద్యోగిణులు స్నానం చేస్తున్నప్పుడు తీసిన వీడియోలను అతనికి పంపడం మొదలుపెట్టింది. కాగా, ఓ రోజు బాత్రూంలో స్నానం చేయడానికి వెళ్లిన ఓ ఉద్యోగిని అక్కడ కిటికీ దగ్గర సెల్ ఫోన్ ఉండటం గమనించింది.

ఆ వీడియోలను అమ్ముకున్న ప్రియుడు

ఆ వీడియోలను అమ్ముకున్న ప్రియుడు

అశ్విని సెల్‌ఫోన్ అని తెలుసుకుని ఆమెను గట్టిగా ప్రశ్నించింది. దీంతో నిద్రమాత్రలు మింగి ఆత్మహత్యకు ప్రయత్నించింది అశ్విని. ఆ తర్వాత ఆమెకు ఆస్పత్రిలో చికిత్స అందించారు. అనంతరం ఆమెను పోలీసులు అదుపులోకి తీసుకుని విచారించారు. బండారం బట్టబయలు కావడంతో ప్రభును కూడా పోలీసులు అరెస్ట్ చేశారు. ఆ దుర్మార్గుడు నర్సుల వీడియోలను ఆన్‌లైన్‌లో అమ్మేసినట్లు పోలీసులు విచారణలో తేలింది. నిందితులను కఠినంగా శిక్షించాలని బాధితులు డిమాండ్ చేస్తున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+