Nurse: పూజ గదిలో ప్రభుత్వ ఆసుపత్రి నర్సు దారుణ హత్య, భర్తతో విడిపోయి ఒంటరిగా ?, ఏం జరిగిందంటే !
బెంగళూరు: ప్రభుత్వ ఆసుపత్రిలో నర్సుగా ఉద్యోగం చేస్తున్న మహిళకు వివాహం అయ్యింది. దంపతులకు ఓ కుమార్తె, కుమారుడు ఉన్నారు. పిల్లలు పుట్టిన తరువాత దంపతుల మద్య తేడాలు వచ్చాయి. ప్రభుత్వ ఉద్యోగం చేస్తున్న భార్య భర్తతో విడిపోయింది. కూతురు, కొడుకుతో కలిసి భర్త వేరే ఊరిలో నివాసం ఉంటున్నాడు. అద్దె ఇంటిలో నివాసం ఉంటున్న భార్య రోజూ ప్రభుత్వ ఆసుపత్రిలో ఉద్యోగం చెయ్యడానికి వెళ్లి వస్తోంది. భర్త విడిపోయిన నర్సు ప్రతిరోజూ భర్తకు ఫోన్ చేసి పిల్లలతో మాట్లాడుతోంది. రెండు రోజులు భార్య నుంచి ఫోన్ రాకపోవడం, ఆమె ఫోన్ స్విచ్ ఆఫ్ రావడంతో అతను భార్య పక్కింటి వాళ్లకు ఫోన్ చేసి ఇంట్లో చూడమని చెప్పాడు. ఇంటి తాళం వేసి ఉండటంతో చుట్టుపక్కల వాళ్లు, పోలీసులు తలుపులు పగలగొట్టి చూడగా పూజ గదిలో నర్సు దారుణ హత్యకు గురైన విషయం వెలుగు చూడటం కలకలం రేపింది. పూజ గది మొత్తం రక్తపు మరకలతో నిండిపోయింది.

నర్సుతో పెళ్లి
తమిళనాడులోని తేనీ జిల్లాలోని అండిపట్టిలో నివాసం ఉంటున్న సెల్వి (43) అనే మహిళకు, దిండుగల్ కు చెందిన సురేష్ కు కొన్ని సంవత్సరాల క్రితం వివాహం అయ్యింది. 17 సంవత్సరాల నుంచి సెల్వి అండిపట్టి ప్రభుత్వ ఆసుపత్రిలో నర్సుగా ఉద్యోగం చేస్తున్నది. సురేష్, సెల్వీ దంపతులకు ఓ కుమార్తె, కుమారుడు ఉన్నారు.

తేడాలు రావడంతో విడిపోయిన దంపతులు
ఇద్దరు పిల్లలు పుట్టిన తరువాత సురేష్, సెల్వి దంపతుల మద్య తేడాలు వచ్చాయి. ప్రభుత్వ ఉద్యోగం చేస్తున్న సెల్వి ఆమె భర్త సురేష్ తో విడిపోయింది. కూతురు, కొడుకుతో కలిసి భర్త దిండుగల్ లో నివాసం ఉంటూ క్యాంటర్ రింగ్ పని చేస్తున్నాడు. అండిపట్టిలోని పాపమ్మాల్ పురంలో అద్దె ఇంటిలో నివాసం ఉంటున్న సెల్వి అండిపట్టి ప్రభుత్వ ఆసుపత్రిలో ఉద్యోగం చెయ్యడానికి వెళ్లి వస్తోంది.

బిడ్డల కోసం భర్తతో టచ్ లో ఉన్న భార్య
భర్త సురేష్ తో తేడాలు వచ్చి విడిపోయిన సెల్వి మాత్రం ఆమె పిల్లలతో ప్రతిరోజూ మాట్లాడుతోంది. భర్త సురేష్ విడిపోయినా సరే నర్సు సెల్వి మాత్రం ప్రతిరోజూ అతనికి ఫోన్ చేసి ఇద్దరు పిల్లలతో మాట్లాడుతోంది. రెండు రోజులు భార్య సెల్వి నుంచి ఫోన్ రాకపోవడం, ఆమె ఫోన్ స్విచ్ ఆఫ్ రావడంతో ఆమె భర్త సురేష్ కు అనుమానం వచ్చింది. తరువాత భార్య సెల్వి పక్కింటిలో నివాసం ఉంటున్న వాళ్లకు ఫోన్ చేసి సెల్వి ఇంటికి వెళ్లి చూడాలని చెప్పాడు.

పూజ గదిలో నర్సు దారుణ హత్య
సెల్వీ ఇంటి తాళం వేసి ఉండటంతో చుట్టుపక్కల వాళ్లు, అండిపట్టి పోలీసులు తలుపులు పగలగొట్టి చూడగా పూజ గదిలో నర్సు సెల్వీ దారుణ హత్యకు గురైన విషయం వెలుగు చూసింది. పూజ గదిలోనే సెల్వీ ముఖం, తలతో పాటు పలు చోట్ల దారుణంగా దాడి చేసి చంపేశారని తెలుసుకున్న ఆమె బంధువులు షాక్ అయ్యారు. సెల్వీ ఇంటిలోని పూజ గది మొత్తం రక్తపు మరకలతో నిండిపోయింది.
వెంటనే దిండుగల్ లో నివాసం ఉంటున్న సెల్వీ భర్త సురేష్ కు సమాచారం ఇచ్చారు.

కేసు పెట్టిన మాజీ భర్త
దిండుగల్ నుంచి కూతురు, కొడుకుతో కలిసి అండిపట్టి చేరుకున్న సురేష్ తన మాజీ భార్య సెల్వీని ఎవరో హత్య చేశారని పోలీసు కేసు పెట్టారు. సెల్వీ ఏ ఆసుపత్రిలో పని చేస్తుందో అాదే ఆసుపత్రిలో ఆమె శవానికి పోస్టుమార్టం చెయ్యడానికి వైద్యులు సిద్దం అయ్యారు. పాతకక్షల కారణంగా సెల్వీ హత్యకు గురైయ్యిందా ? కుటుంబ సమస్య కారణంగా హత్య జరిగిందా ?, మరేమైనా కారణాలు ఉన్నాయా ? అంటూ వివిద కోణాల్లో పోలీసు అధికారులు విచారణ చేస్తున్నారు. ఇంట్లో ఒంటరిగా నివాసం ఉంటున్న ప్రభుత్వ ఆసుపత్రి నర్సు దారుణ హత్యకు గురి కావడం తేనీ జిల్లాలో కలకలం రేపింది.
-
ఈ సినిమా చూస్తే ఈఎంఐల జోలికే పోరు సామి! -
today rashiphalalu: మీనరాశిని వదిలిపెట్టని ముఖ్యగ్రహాలు.. వీరి పంట పండుతుంది! -
హైదరాబాద్ జూపార్క్ లో వింత జంతువు.. భారీగా తరలివస్తున్న పర్యటకులు -
మెగాస్టార్ కొత్త మూవీ షూటింగ్ షురూ.. క్లాప్ కొట్టిన పవన్ !! -
‘బాహుబలి2’, ‘పుష్ప2’లో నిజమైన ఇండస్ట్రీ హిట్ ఏది? -
కాచిగూడ మీదుగా తిరుపతికి వెళ్లే మరో ప్రత్యేక రైలు.. ఇకపై: ఏపీలో హాల్ట్ స్టేషన్లు -
అమెరికన్ కరెన్సీ ఇకపై.. !! -
సమ్మర్ స్పెషల్ 'పెసరపప్పు చారు'.. ఇదొక్కటి యాడ్ చేస్తే టేస్ట్ అద్దిరిపోద్ది..! -
వంట గ్యాస్ ఇక బుక్ చేయాలంటే, ఇలా తప్పనిసరి - తాజా మార్గదర్శకాలు..!! -
రామ్చరణ్ నా ప్రాణం కంటే ఎక్కువ: అల్లు అర్జున్ -
తెలంగాణలో కొత్త అసెంబ్లీ సీట్లు ఇవే, కలిసొచ్చేది ఆ పార్టీకే- అసలు లెక్క..!! -
భారీగా బీర్ల ధరలు పెంపు, ఏ బ్రాండ్ ఎంత.!!












Click it and Unblock the Notifications