చెన్నై వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

బలనిరూపణలో ఓడి... శశికళకు అలా చెక్ చెప్పేందుకు పన్నీరు ప్లాన్

గత నెల 18వ తేదీన (ఫిబ్రవరి) అసెంబ్లీలో జరిగిన విశ్వాస తీర్మానం పైన మాజీ సీఎం పన్నీరు సెల్వం సుప్రీం కోర్టుకు వెళ్లనున్నారని తెలుస్తోంది. విశ్వాస తీర్మానంలో ఆ రోజు పళనిస్వామి బలం నిరూపించుకున్నారు.

|
Google Oneindia TeluguNews

చెన్నై: గత నెల 18వ తేదీన (ఫిబ్రవరి) అసెంబ్లీలో జరిగిన విశ్వాస తీర్మానం పైన మాజీ సీఎం పన్నీరు సెల్వం సుప్రీం కోర్టుకు వెళ్లనున్నారని తెలుస్తోంది. విశ్వాస తీర్మానంలో ఆ రోజు పళనిస్వామి బలం నిరూపించుకున్నారు.

ఆ రోజు సభలో గందరగోళం చెలరేగింది. దీనిపై సుప్రీం కోర్టుకు వెళ్లాలని పన్నీరు సెల్వం భావిస్తున్నట్లుగా తెలుస్తోంది. ఎమ్మెల్యేల బల నిరూపణలో శశికళ ముందు చిత్తయిన పన్నీరు.. ఇక న్యాయపరంగా ఆమెను ఎదుర్కోవాలనుకుంటున్నారు.

రహస్యంపై రెడీ: 3 గం.ల ముందు బ్లాక్ క్యాట్స్.. జయ మృతిపై ఎన్నో డౌట్స్ రహస్యంపై రెడీ: 3 గం.ల ముందు బ్లాక్ క్యాట్స్.. జయ మృతిపై ఎన్నో డౌట్స్

ఆ రోజు అసెంబ్లీ జరిగిన తీరు సరిగా లేదని, బలవంతంగా విపక్షాలను బయటకు పంపించి విశ్వాస తీర్మానంలో నెగ్గారనే ఆరోపణలు ఉన్నాయి. దీనిపై కోర్టుకు వెళ్లి న్యాయపరంగా శశికళకు చెక్ చెప్పాలని పన్నీరు భావిస్తున్నారు.

O Panneerselvam to move Supreme Court today on confidence vote

ఈ రోజే (శుక్రవారం) పన్నీరుసెల్వం వర్గీయులు కోర్టులో పిటిషన్ దాఖలు చేయవచ్చునని అంటున్నారు.

ఆర్టికల్ 32 కింద పిటిషన్ దాఖలు చేసేందుకు సిద్ధం కావాలని ఢిల్లీలోని తన లాయర్లకు పన్నీరు సెల్వం చెప్పినట్లుగా కూడా వార్తలు వస్తున్నాయి. అంతేకాదు, ఇది కోర్టు ముందుకు త్వరగా విచారణకు వచ్చేలా చూడాలని కూడా కోరినట్లు తెలుస్తోంది.

English summary
In the proposed writ petition, sources said, Panneerselvam will challenge the validity of the assembly proceedings on February 18 when a confidence motion was passed in favour of Palaniswami.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X