పన్నీరు ఓడిపోయారు, సమాప్తం:´'జైలు నుంచి శశికళ'పై.. స్వామి ఇలా
తమిళనాడు రాజకీయ సంక్షోభంపై బీజేపీ నేత, రాజ్యసభ సభ్యులు సుబ్రహ్మణ్య స్వామి గురువారం ఓ టీవీ ఛానల్‌లో స్పందించారు. పన్నీరు సెల్వం ఓటమి చెందారని, అంతటితో అది పరిసమాప్తం అన్నారు.
చెన్నై: తమిళనాడు రాజకీయ సంక్షోభంపై బీజేపీ నేత, రాజ్యసభ సభ్యులు సుబ్రహ్మణ్య స్వామి గురువారం ఓ టీవీ ఛానల్‌లో స్పందించారు. పన్నీరు సెల్వం ఓటమి చెందారని, అంతటితో అది పరిసమాప్తం అన్నారు.
పన్నీరు సెల్వం వెనుక ఇద్దరు కేంద్రమంత్రులు ఉన్నారని ఆయన గతంలో ఆరోపించారు. దీనిపై ఇప్పుడు మాట్లాడేందుకు నిరాకరించారు.
తమిళనాడు రాజకీయాల్లో తనకు ఎలాంటి పాత్ర లేదని సుబ్రహ్మణ్య స్వామి అన్నారు. ప్రభుత్వం ఏర్పడకముందు అక్కడ సమస్య, సంక్షోభం ఉంది కాబట్టి తాను స్పందించానని, ఇప్పుడు ఏ సమస్య లేదని, తాను జోక్యం చేసుకోనని చెప్పారు.

తాను పార్లమెంటు సభ్యుడిని అని, జాతీయ దృక్పథంతో ముందుకు వెళ్తానని చెప్పారు. పన్నీరు వెనుక ఇద్దరు కేంద్రమంత్రులు ఉన్నారని చెప్పారుగా అని అడిగితే.. అదంతా గతం అన్నారు. అలాగే, శశికళ జైలు నుంచి కంట్రోల్ చేస్తారా అని అడిగితే కూడా సమాధానం చెప్పేందుకు నిరాకరించారు.
పన్నీరు కారుకు ఎర్ర బుగ్గ తొలగింపు
దివంగత జయలలిత విశ్వాసపాత్రుడు పన్నీరు సెల్వం కారుకు బుగ్గ కారు తొలగించారు. పళనిస్వామి ఈ రోజు సాయంత్రం ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన విషయం తెలిసిందే. నేటి దాకా పన్నీరు ఆపద్ధర్మ సీఎంగా ఉన్నారు.
కాగా, అంతకుముందు పన్నీరు సెల్వం మాట్లాడుతూ.. పార్టీని, ప్రభుత్వాన్ని ఓ కుటుంబం నడపాలనుకుంటుందని, తాను వారి పైన పోరాటం చేస్తానని పన్నీరు సెల్వం ప్రకటించారు. ప్రస్తుతం నియంత చేతిలో పార్టీ ఉందని, ఓ కుటుంబం శాసిస్తోందని ధ్వజమెత్తారు.












Click it and Unblock the Notifications