వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

సరి-బేసి: అనూహ్య స్పందన, బస్సులో మంత్రులు

By Nageswara Rao
|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: ఢిల్లీ ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన సరి బేసి కార్ల ప్రయోగం ఈరోజు నుంచి అమల్లోకి వచ్చింది. ఈ ప్రయోగంతో దాదాపు పది లక్షల వాహనాలకు విశ్రాంతి లభించనుంది. ఈ సరి బేసి కార్ల ప్రయోగానికి ఢిల్లీ సీఎంతో పాటు మంత్రులు సైతం మేమంటూ అవలంభించారు.

తొలిరోజు సీఎం కేజ్రీవాల్ తన సహచర మంత్రులైన గోపాల్ రాయ్, సత్యేంద్ర జైన్‌లతో కలిసి ఒకే కారులో వెళ్లారు. సీఎం లైసెన్సు ప్లేటు నెంబర్ బేసి సంఖ్యతో ముగుస్తుండటంతో ఆయన ఆ కారుని శుక్రవారం ఉపయోగించుకున్నారు. శనివారం ఆ కారుని బయటకు తీయకూడదు. మరికొంత మంది మంత్రులు సచివాలయానికి వెళ్లేందుకు వివిధ మార్గాలను అవలంభిస్తున్నారు.

Odd-even scheme: Kejriwal, his ministers to lead by example

ఢిల్లీ సాంస్కృతిక శాఖ మంత్రి కపిల్ మిశ్రా సైకిల్ మీద వెళ్లనున్నారు. పర్యావరణ మంత్రి ఇమ్రాన్ హుస్సేన్ ఆటోలో ప్రయాణించారు. మరో మంత్రి సందీప్ కుమార్ బస్సులో సచివాలయానికి వెళ్లారు. సరి బేసి ప్రయోగం కారణంగా గమ్యస్థానాలకు చేరుకోవడం ఎవరికైనా ఇబ్బంది అయితే ఫోన్ చేసేందుకు 011-42400400, 011- 41400400 హెల్‌లైన్ నెంబర్లను ఏర్పాటు చేశారు.

దీంతో పాటు @transportdelhi అనే ట్విట్టర్ ఐడీ ద్వారా మీ ఇబ్బందులను తెలియజేయవచ్చు. జనవరి 1 నుంచి 15 వరకు ఈ సరి బేసి స్కీంను ప్రయోగాత్మకంగా ఢిల్లీ ప్రభుత్వం చేపట్టనుంది. ఒంటరి మహిళలు, వీవీఐపీలకు మాత్రం దీన్నుంచి మినహాయింపు ఇచ్చారు.

ఈ సరి బేసి రూల్స్‌ను ఎవరైనా అతిక్రమిస్తే రూ. 2వేల జరిమానా విధిస్తారు. ఇందుకోసం ట్రాఫిక్ పోలీసులతో పాటు దాదాపు 7,500 మంది వాలంటీర్లు ఢిల్లీ ప్రభుత్వం నియమించింది. కాగా, రెండు వారాల పాటు తాము ప్రవేశపెట్టిన నిబంధనను కచ్ఛితంగా పాటించాలని ఢిల్లీ వాసులను ఆయన కోరారు.

"ఢిల్లీ వైపు ఇండియా మొత్తం ఆసక్తిగా చూస్తోంది. గతంలో ఇటువంటి నిర్ణయం ఎక్కడా అమలు కాలేదు. ప్రజలు అర్థం చేసుకున్నారు. ఇప్పటికే మంచి స్పందన వచ్చింది. నాకు ఒక్క సరిసంఖ్య ఉన్న పాసింజర్ వాహనం కూడా కనిపించ లేదు. నాకు అందుతున్న సమాచారం ప్రకారం మా ప్లాన్ విజయవంతమైనట్టే" అని ఆయన అన్నారు.

English summary
To send a strong message to people, Chief Minister Arvind Kejriwal and his cabinet ministers will carpool to work and use public transport with the start of the odd-even scheme that will restrict movement of private cars on Delhi's roads for 15 days from today.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X