విషాదం: పార్లమెంట్ ఆవరణలో కుప్పకూలిన ఎంపీ, తలకు గాయం..

Subscribe to Oneindia Telugu

న్యూఢిల్లీ: పార్లమెంట్ బడ్జెట్ సమావేశాల సందర్భంగా శుక్రవారం విషాద సంఘటన చోటు చేసుకుంది. ఒడిశా ఎంపీ ఏవి స్వామి పార్లమెంటు ప్రాంగణంలో కుప్పకూలిపోయారు. ఒక్కసారిగా కిందపడటంతో ఆయన తలకు బలంగా గాయమైనట్టు తెలుస్తోంది.

ఆ వెంటనే ఆయన్ను ఢిల్లీలోని రామ్ మనోహర్ లోహియా ఆసుపత్రికి తరలించారు. ఆసుపత్రికి తరలిస్తున్న క్రమంలో ఆయన నుదుటి భాగం నుంచి రక్తం కారడం స్పష్టంగా కనిపించింది.

Odisha MP AV Swamy Collapses in Parliament, Rushed to Hospital

బడ్జెట్ సమావేశాల్లో పాల్గొనడానికి వచ్చిన ఆయన అనారోగ్య కారణాల వల్ల తీవ్ర అస్వస్థతకు గురైనట్టు తెలుస్తోంది. ఆయన ఆరోగ్య పరిస్థితిపై ఉపరాష్ట్రపతి, రాజ్యసభ చైర్మన్ వెంకయ్య నాయుడు రాజ్యసభలో ప్రకటన చేశారు.

స్వామి అనారోగ్యానికి సంబంధించి వివరాలు తెలియాల్సి ఉందన్నారు. కాగా, 2012లో ఏవీ స్వామి ఒడిశా నుంచి స్వతంత్ర అభ్యర్థిగా రాజ్యసభకు ఎంపికయ్యారు.

ఇంకా వివాహం చేసుకోలేదా? తెలుగు మ్యాట్రిమోనిలో నేడే రిజిస్టర్ చేసుకోండి - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
Odisha Member of Parliament AV Swamy was rushed to a hospital after he collapsed in the Parliament premises on Friday, 9 February. He has reportedly been admitted in Delhi’s Ram Manohar Lohia Hospital.

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి