షాక్: క్లాస్‌రూమ్‌లోనే గ్యాంగ్‌రేప్, లెక్చరర్‌పై దాడి

భువనేశ్వర్: క్లాస్‌రూమ్‌లోనే విద్యార్థినిపై లైంగిక దాడి చేయడమే కాకుండా ఆ దృశ్యాలను చిత్రీకరించారు.ఈ ఘటన నవంబర్ 7వ, తేదిన చోటు చేసుకొంది. ఒడిశా రాష్ట్రంలో చోటు చేసుకొంది. ఈ ఘటనకు పాల్పడిన నిందితుల్లో ఇద్దరిని పోలీసులు అరెస్ట్ చేశారు.

దేశంలో ప్రతి రోజూ మహిళలపై ఏదో ఘటన చోటుచేసుకొంటుంది. లైంగిక దాడులతో పాటు వేదింపులు చోటుచేసుకొంటున్నాయి. అయితే ఒడిశా రాష్ట్రంలో తరగతి గదిలోనే ఈ ఘటన చోటు చేసుకోవడం విషాదకరమైన ఘటన.

విద్యార్థినిపై లైంగిక దాడి చేసేందుకు ప్రయత్నించిన దుండగులను లెక్చరర్ ప్రయత్నించారు. అయతే లెక్చరర్‌పై దాడి చేశారు. ఈ ఘటన ఒడిశా రాష్ట్రంలో సంచలనం కల్గించింది.

 క్లాస్‌రూమ్‌లోనే విద్యార్థినిపై గ్యాంగ్ రేప్

క్లాస్‌రూమ్‌లోనే విద్యార్థినిపై గ్యాంగ్ రేప్

ఒడిశా రాష్ట్రంలోని మైథిలి పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో నవంబర్‌ 7న ఒక విద్యార్థినిపై ముగ్గురు కామంధులు విద్యార్థినిపై లైంగిక దాడికి పాల్పడ్డారు.తరగతి గదిలోనే వివస్త్రను చేసి.. ఆపై వీడియో తీసి.. అడ్డొచ్చిన లెక్చరర్‌ను చితకబాదారు. బాధితురాలిపై అత్యాచారం చేసిన దృశ్యాలను సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఈ వీడియో వైరల్‌గా మారాయి.

 హ్యండ్ బ్యాగ్ కోసం వచ్చి గ్యాంగ్ రేప్

హ్యండ్ బ్యాగ్ కోసం వచ్చి గ్యాంగ్ రేప్

నవంబర్‌7న బాధితురాలు ప్రాక్టికల్‌ తరగతులు ముగించుకుని ఇంటికి వెళుతోంది. అయితే కొద్దిదూరం వెళ్లాక హ్యాండ్‌బ్యాగ్‌ మర్చిపోయారు. హ్యండ్ బ్యాగ్ మర్చిపోయిన విషయం గుర్తుకు వచ్చి బాధితురాలు తిరిగి తరగతి గదికి వచ్చింది.. అప్పటికే క్లాస్‌రూమ్‌లో కాలేజీకి సంబంధంలేని ముగ్గురు యువకులు అక్కడ ఉన్నారు.అప్పటికే మద్యం సేవించి ఉన్న ముగ్గురు యువకులు.. బాధితురాలిపై అత్యాచారానికి పాల్పడ్డారు. ఈ దృశ్యాలను వీడియోలు తీశారు.

లెక్చరర్‌పై దాడిపై కత్తి పోట్లు

లెక్చరర్‌పై దాడిపై కత్తి పోట్లు

బాధితురాలిపై అత్యాచారం చేస్తున్న సమయంలో ఆమె అరుపులు విన్న లెక్చరర్ అజయ్‌కుమార్ నిందితులను ప్రతిఘటించే ప్రయత్నం చేశారు. అయితే నిందితులు లెక్చరర్ అజయ్‌కుమార్‌పై కత్తితో దాడికి దిగారు.ఈ ఘటనపై లెక్చరర్‌తో కలిసి బాధితురాలు నవంబర్‌ 9న పోలీసులకు ఫిర్యాదు చేశారు.

పోలీసుల నిర్లక్ష్యంపై ఫిర్యాదు

పోలీసుల నిర్లక్ష్యంపై ఫిర్యాదు


క్లాస్‌రూమ్‌లోనే విద్యార్థినిపై అత్యాచారం జరిగిన ఘటనపై లెక్చరర్‌తో కలిసి బాధితురాలు స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేసింది. అయితే ఈ కేసు పట్ల పోలీసులు నిర్లక్ష్యంగా వ్యవహరించారు. దీంతో వారు ఉన్నతాధికారులను ఆశ్రయించారు.ఉన్నతాధికారులు జోక్యం చేసుకొంటే స్థానిక పోలీసులు కేసు నమోదు చేశారు. ఇద్దరు నిందితులను అరెస్ట్ చేశారు. మరో నిందితుడి కోసం గాలిస్తున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+