పెన్సిల్, నోట్‌బుక్స్ కొనివ్వలేదని బాలిక ఆత్మహత్య

భువనేశ్వర్: ఒడిశా రాష్ట్రంలోని గంజా జిల్లా ఆస్కా పట్టణంలో విషాద ఘటన చోటు చేసుకుంది. పాఠశాలకు వెళ్లేందుకు పెన్సిల్, నోట్‌బుక్, ఇతర స్టడీ మెటీరియల్ కొనడానికి తల్లిదండ్రులు డబ్బు లేదని చెప్పడంతో ఓ 14ఏళ్ల బాలిక ఆత్మహత్య చేసుకుంది.

జూన్ 23వ తేదీన పాఠశాల ప్రారంభం కావడంతో 7వ తరగతి చదువుతున్న జయంతి అనే బాలిక తనకు నోట్‌బుక్, పెన్సిల్, ఇతర స్టడీ మెటీరియల్ కొనివ్వాలని తల్లిదండ్రులను అడిగింది. అయితే డబ్బు సమకూర్చడానికి కొంత సమయం కావాలని వారు చెప్పారు. దీంతో ఇంట్లో ఎవరూ లేని సమయంలో బాలిక తన ఒంటిపై కిరోసిన్ పోసుకొని నిప్పంటించుకుంది.

Odisha Schoolgirl Commits Suicide for Pencil, Notebook

మంటల్లో కాలిపోతున్న ఆ బాలికను చూసిన ఇరుగు పొరుగువారు ఆమెను కాపాడే యత్నం చేశారు. మంటలర్పి హుటాహుటిన ఆస్పత్రికి తరలించారు. కాగా, తీవ్రగాయాల కారణంగా ఆమె ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందింది.

బాధిత బాలిక తండ్రి బిజోయ్ నాయక్ దినసరి కూలీగా పని చేసేవాడు. అనారోగ్యం కారణంగా అతను ప్రస్తుతం ఇంట్లోనే ఉంటున్నాడు. బాలిక తల్లి ఇతర ఇళ్లల్లో పని మనిషిగా పని చేసి కుటుంబాన్ని పోషిస్తోంది. వీరికి జయంతితోపాటు ముగ్గురు చిన్న పిల్లలు ఉన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+