గర్ల్ ఫ్రెండ్ కు ఐఫోన్ కొనివ్వడానికి.. ఎంతకు తెగించావ్ రా..?
పీకల్లోతు ప్రేమలో ఉన్న కొందరు యువతీయువకులు ఎంతకైనా తెగిస్తారు. తమ లవర్ ను సర్ ప్రైజ్ చేయడానికి, వారికి కావాల్సింది కొనివ్వడానికి ఎంత దూరమైనా వెళ్తుంటారు. ఇలా ప్రేమ మోజులో పడి తమ బంగారు భవిష్యత్తును నాశనం చేసుకున్నవాళ్లు మన చుట్టూనే చాలామంది కనిపిస్తుంటారు. తాజాగా అలాంటి ఘటనే ఒడిషాలో జరిగింది. తాను ప్రాణంగా ప్రేమించిన గర్ల్ ఫ్రెండ్ కోసం స్మగ్లర్ అవతారం ఎత్తాడు ఓ బీటెక్ స్టూడెంట్. 22 కేజీల గంజాయిని స్మగ్లింగ్ చేసేందుకు పూనుకున్నాడు. ఈ క్రమంలో పోలీసులకు చిక్కాడు. అయితే పోలీసుల విచారణలో తన లవర్ బర్త్ డే సందర్భంగా తనకు ఖరీదైన ఐఫోన్ కొనివ్వడానికి గంజాయిని అమ్మినట్లు తేలడంతో పోలీసులు షాక్ అవుతున్నారు.
ఒడిషాలోని మల్కాన్ గిరి జిల్లాలో షాకింగ్ ఘటన జరిగింది. ఓ బీటెక్ స్టూడెంట్ తన లవర్ కోసం బంగారం లాంటి భవిష్యత్తును పనంగా పెట్టి పోలీసులకు చిక్కాడు. 22 కేజీల గంజాయిని అక్రమంగా విక్రయిస్తూ పాట్రోలింగ్ పోలీసులకు చిక్కాడు. విచారణలో తన ప్రేయసి బర్త్ డేకి ఐఫోన్ కొనివ్వడం కోసం గంజాయి విక్రయిస్తున్నట్లు తేలింది. దీంతో పోలీసులు షాక్ అయ్యారు. ఎంవీ-79 పాట్రోలింగ్ టీమ్ ఈ యువకుడ్ని అరెస్ట్ చేసింది. అతడి దగ్గర చిన్న ప్యాకెట్స్ లో ఉన్న దాదాపు 22 కేజీల గంజాయిని స్వాధీనం చేసుకుంది.
ఒడిషా టీవీ అందించిన సమాచారం ప్రకారం.. నిందితుడు ధీరేన్ కుమార్.. ఓ బీటెక్ స్టూడెంట్.. అయితే ధీరేన్ కుమార్ తన స్నేహితుడితో కలిసి శనివారం రోజు గంజాయి విక్రయిస్తుండగా ఎంవీ-79 పాట్రోలింగ్ టీమ్ వీరిద్దరినీ అదుపులోకి తీసుకుంది. విచారణలో వారి వద్ద 22కేజీల గంజాయి ఉందని తేలడంతో ఆ మొత్తాన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈజీ మనీ, క్విక్ మనీ కోసం స్టూడెంట్స్ గంజాయి విక్రయానికి పాల్పడినట్లు తేలింది. ఇవి చట్టవ్యతిరేక కార్యకలాపాలే కాకుండా.. విద్యార్థుల భవిష్యత్తు కూడా అంధకారంలోకి వెళ్తుందని పోలీసులు వార్నింగ్ ఇచ్చారు. వీరిని మరిన్ని కోణాల్లో విచారిస్తున్నారు.

మరోవైపు సెంట్రల్ జైలులో ఖైదీలకు అక్రమంగా పొగాకు సరఫరా చేస్తున్న పోలీసులకు జైలు అధికారులు అదుపులోకి తీసుకున్నారు. ఈ ఘటన పంజాబ్ లోని లుథియానాలో జరిగింది. నిందితుడు ఏఎస్ఐ మనోజ్ సింగ్ గా గుర్తించారు. పంజాబ్ లోని లాధోవాల్ పోలీస్ స్టేషన్ లో విధులు నిర్వర్తిస్తున్న మనోజ్ సింగ్.. సెంట్రల్ జైలులోని ఖైదీలకు అక్రమంగా పొగాకు సరఫరా చేస్తున్నట్లు గుర్తించిన జైలు సిబ్బంది.. అతడ్ని పట్టుకున్నారు. ప్రస్తుతం ఈ ఘటనపై విచారణ నిర్వహిస్తున్నారు.












Click it and Unblock the Notifications