ప్రమాదం వెనుక, మృతుల సంఖ్య 288 - పునరుద్దరణ పనుల్లో రైల్వే మంత్రి..!!

ఒడిశాలోని బాలాసోర్‌ జిల్లాలో జరిగిన ఘోర రైలు ప్రమాదం పెను విషాదాన్ని మిగిల్చింది. మూడు రైళ్లు ఢీకొన్న ఈ ఘటన యావత్‌ దేశాన్ని దిగ్భ్రాంతికి గురిచేసింది. మృతుల సంఖ్య పెరుగుతోంది. ఇప్పటి వరకు అధికారిక లెక్కల ప్రకారం 288 మంది ప్రాణాలు కోల్పోయారు. 747 మంది గాయాల పాలయ్యారు. వారిలో 56 మంది పరిస్థితి విషమంగా ఉంది. సహాయక చర్యలు ముగియటంతో పునరుద్దరణ పనులను ప్రారంభించారు. రైల్వే మంత్రి ఘటనా స్థలంలోనే మకాం వేసారు.

అతి పెద్ద ప్రమాదంగా: ఒడిశా రైలు ప్రమాదం పదేళ్ల కాలంలో అతి పెద్ద ప్రమాదంగా నిలిచింది. ఏకంగా 288 మందిని పొట్టన పెట్టుకుంది. మరి కొంత మంది ఆస్పత్రుల్లో సీరియస్ కండీషన్ లో ఉన్నారు. మూడు రైళ్లు ఢీ కొనటం అనేది దేశ చరిత్రలో ఇదే తొలి సారి. ఘటన జరిగిన ప్రాంతంలో పరిస్థితి భీతావాహంగా మారింది. ఉక్కు పట్టాలు సైతం తుక్కుగా విరిగి పడ్డాయి. బోగీలు నుజ్జునుజ్జవగా.. వాటి కింద చితికిన, ముక్కలైన ప్రయాణికుల శరీరాలు, రక్తసిక్త దృశ్యాలతో ఆ ప్రాంతమంతా మరుభూమిని తలపించింది.

Odisha train accident:Death toll in the incident stands at 288 with 747 people injured, restoration work underway

కొన్ని మృతదేహాల స్థితిని చెప్పేటప్పుడు ప్రత్యక్ష సాక్షుల గొంతు వణికింది. దేశ రైల్వే చరిత్రలోనే అతి పెద్ద దుర్ఘటనల్లో ఇది ఒకటి కావడంతో వేలాదిగా సహాయ సిబ్బంది తరలి వచ్చారు. వైమానిక దళం, సైన్యం రంగంలోకి దిగాయి. వందలాది అంబులెన్స్‌లు, వాహనాలు, విపత్తు సహాయక బృందాలు.. భారీ సంఖ్యలో సహాయక చర్యల్లో పాల్గొన్నాయి.

పూర్తయిన రెస్క్యూ ఆపరేషన్: ప్రధాని మోదీ ఘటనా స్థలిని పరిశీలించారు. ఆస్పత్రుల్లో బాధితులను పరామర్శించారు. ఒడిశా సీఎం నవీన్ పట్నాయక్ సహాయక చర్యలను పర్యవేక్షించారు. ఘటనా స్థలికి చేరుకున్న రైల్వే మంత్రి అశ్విణీ వైష్ణవ్ దగ్గర ఉండి సహాయక, పునరుద్దరణ చర్యలను సమన్వయం చేస్తున్నారు. పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ఘటనా స్థలిని పరిశీలించారు. ప్రమాదంలో చిక్కుకున్న మిగిలిన ప్రయాణీకులను ప్రత్యేక రైళ్ల ద్వారా సొంత రాష్ట్రాలకు పంపారు.

తమిళనాడు ప్రయాణీకులతో పంపిన ప్రత్యేక రైలు కాసేపట్లో చెన్నై చేరుకుంటుంది. ఏపీ నుంచి మంత్రి అమర్నాధ్ తో పాటుగా అధికారుల టీం వెళ్లి ప్రత్యేక రైళ్ల ద్వారా విశాఖ, విజయవాడకు ప్రయాణీకులను తీసుకొచ్చారు. శుక్రవారం అర్ధరాత్రి మొదలైన రెస్క్యూ ఆపరేషన్‌ శనివారం సాయంత్రానికి పూర్తి అయిందని ఒడిసా ప్రభుత్వ ప్రధాన క్యాదర్శి పీకే జెనా వెల్లడించారు.

సిగ్నల్‌ లోపం కారణంగా: ఈ ఘోర ప్రమాదం వెనుక కారాణం ఏంటనే దాని పైన ప్రాధమిక నివేదిక అందింది. రైల్వేశాఖ నిపుణుల బృందం ఈ ప్రమాదం సిగ్నల్‌ లోపం కారణంగానే ప్రమాదం జరిగిందని వెల్లడించింది. లూప్ లైన్‌లో ఉన్న గూడ్స్‌ను కోరమాండల్ ఎక్స్ ప్రెస్ ఢీకొనడం వల్లే మొదట ప్రమాదం జరిగిందని తెలిపింది. మెయిన్ లైన్‌లో నుంచి వెళ్లాల్సిన కోరమండల్ లూప్ లైన్లోకి వెళ్లిందని అధికారులు పేర్కొన్నారు.

మొదట కోరమండల్‌కు మెయిన్ లైన్లో వెళ్లేందుకు సిగ్నల్ ఇచ్చారు. కానీ కొద్దిసేపటికి ఇచ్చిన సిగ్నల్‌ను నిలిపివేశారని అధికారులు తెలిపారు. సిగ్నల్ నిలిపివేయడం వల్లే మెయిన్ లైన్‌లో వెళ్లాల్సిన కోరమండల్ లూప్ లైన్లోకి వెళ్లి గూడ్స్‌ను ఢీకొట్టి పట్టాలు తప్పిందని.. పట్టాల తప్పిన కోరమండల్‌ను యశ్వంతపూర్ ఎక్స్ ప్రెస్ ఢీ కొట్టిందని వెల్లడించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+