ఒడిశా రైలు ప్రమాదం: రైళ్ళ ప్రమాదాలను నియంత్రించే 'కవచ్' వ్యవస్థ ఎక్కడ?

ఒడిశాలోని బాలాసోర్ సమీపంలో జరిగిన ఘోర రైలు ప్రమాద ఘటనలో వందల సంఖ్యలో ప్రయాణికులు ప్రాణాలు కోల్పోయారు. మూడు రైళ్లు ఒకేసారి ప్రమాదానికి గురికావడంతో భారత రైల్వే చరిత్రలోనే ఘోర విషాద ఘటన చోటు చేసుకుంది. 2016- 2017 సంవత్సరం తర్వాత జరిగిన అతిపెద్ద రైలు ప్రమాదం ఇదేనని చెబుతున్నారు.

ఈ ప్రమాదం రైల్వే భద్రతా వ్యవస్థ, రైళ్ల ప్రమాదాలను నియంత్రించే కవచ్ వ్యవస్థ పనితీరు పై ప్రశ్నలను లేవనెత్తింది. గతంలో రైల్వే శాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్ రాజ్యసభలో అడిగిన ఒక ప్రశ్నకు భారతీయ రైల్వే ప్రమాద నిరోధక వ్యవస్థ అయిన కవచ్ గురించి చెప్పారు. కవచ్ దశలవారీగా అమలు చేయబడుతుంది అని ఆయన వెల్లడించారు.

Odisha train accident

ఆర్డీఎస్ఓ పథకం క్రింద దక్షిణ మధ్య రైల్వేలో ఇప్పటికే 1455 రూట్ కిలోమీటర్లు కవర్ చేయబడ్డాయి అని ఆయన పేర్కొన్నారు. దేశంలోని రైల్వే మార్గాలలో ప్రమాదాలను నివారించడానికి 34 వేల కిలోమీటర్ల రైలు మార్గాలలో కవచ్ టెక్నాలజీని ఆమోదించినట్టు ఆయన తెలిపారు. మార్చి 2024 నాటికి దేశ వ్యాప్తంగా అత్యంత రద్దీగా ఉండే రైలు మార్గాలలో దీన్ని ఇన్స్టాల్ చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు తెలిపారు.

కవచ్ టెక్నాలజీ ని ఏర్పాటు చేయడం కోసం రెండువేల 2021 - 2022 సంవత్సరంలో 133 కోట్లు విడుదల అయ్యాయి. రైలు ప్రమాదాలను నివారించడానికి ఈ టెక్నాలజీని వినియోగిస్నతుట్టు రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ పేర్కొన్నారు. అయితే ప్రస్తుతం జరిగిన రైలు ప్రమాదంలో కవచ్ టెక్నాలజీని ఉపయోగించినట్లుగా కనిపించడం లేదు. రైల్వే మంత్రిత్వ శాఖ దేశవ్యాప్తంగా యాంటీ-కొలిజన్ సిస్టమ్ కవచ్ ను ఇంకా ఇన్స్టాల్ చేసే ప్రక్రియ లోనే ఉంది.

Odisha train accident

రైళ్లకు ప్రమాదకర పరిస్థితి వచ్చినప్పుడు ఈ సిస్టమ్ రైలు డ్రైవర్‌ను అప్రమత్తం చేయగలదు, బ్రేక్‌లను నియంత్రించగలదు. అదే ట్రాక్‌లపై మరొక రైలును గమనించినప్పుడు రైలును ఆపగలదు. అయితే ఒడిస్సాలో రైలు ప్రమాదం జరిగిన మార్గంలో ఈ టెక్నాలజీ అందుబాటులో లేదని చెబుతున్నారు. ఒకవేళ ఈ టెక్నాలజీ అందుబాటులో ఉంటే ఇంత ఘోర ప్రమాదం జరిగి ఉండేది కాదని అంటున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+