వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

రఫేల్ యుద్ధ విమానాలతో చైనాకు గుబులు: దేనికైనా సిద్ధమేనంటూ ఐఏఎఫ్ చీఫ్ భదౌరియా

|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: మన దేశ అమ్ములపొదిలో చేరిన రఫేల్ యుద్ధ విమానాలతో చైనా క్యాంపులో ఆందోళన నెలకొందని భారత వాయుసేన చీఫ్ ఆర్కేఎస్ భదౌరియా తెలిపారు. మీడియాతో మాట్లాడుతూ.. ఆయన ఈ మేరకు వ్యాఖ్యానించారు.

Recommended Video

India-China Stand Off : China క్యాంపులో ఆందోళన.. దేనికైనా సిద్ధమేనంటూ IAF Chief Bhadauria

చైనా బలగాలు వారి జే-20 యుద్ధ విమానాలను ఈశాన్య లడఖ్ సరిహద్దు వరకు తీసుకొచ్చాయి. వారు అక్కడ్నుంచి వెళ్లిపోయినా తిరిగివచ్చే అవకాశాలు లేకపోలేదు. ఈ సమయంలోనే భారత భద్రతా దళాల చేతికి రఫేల్ యుద్ధ విమనాలు వచ్చాయి. సరిహద్దులో ఉన్న వారి యుద్ధ విమానాలు సామర్థ్యం మాకు తెలుసు. అందుకే రఫేల్ యుద్ధ విమానాలను రంగంలోకి దించామని భదౌరియా తెలిపారు.

Of course, Rafale caused worries in Chinese camp’: IAF chief RKS Bhadauria

భారత్-చైనా సరిహద్దులో శాంతిని నెలకొల్పేందుకు ఇరు పక్షాలు చర్చలు జరుపుతున్నాయి. బలగాల ఉపసంహరణ జరిగితే మంచిదే. అలా కానీ, పక్షంలో తాము అన్నింటికీ సిద్ధంగా ఉన్నామని చెప్పారు ఎయిర్ చీఫ్ మార్షల్ భదౌరియా. చైనా బలగాలు సరిహద్దు ప్రాంతంలోనే ఉండటంతో.. మన భద్రతా బలగాలు కూడా అక్కడే ఉండి చైనా కదలికలను గమనిస్తున్నాయని చెప్పారు.

గత నెలలో మూడవ బ్యాచ్‌లో మూడు రాఫెల్ ఫైటర్ జెట్లు భారతదేశంలో అడుగుపెట్టాయి. కొత్త బ్యాచ్ రాకతో, రాఫెల్ విమానాల సంఖ్య 11 కి పెరిగింది. సెప్టెంబర్ 2016లో ఫ్రాన్స్ నుంచి, రూ. 59,000 కోట్ల వ్యయంతో మొత్తం 36 యుద్ధ విమానాలను వైమానిక దళం ఆదేశించింది. ఫ్రెంచ్ ఏరోస్పేస్ మేజర్ డసాల్ట్ ఏవియేషన్ తయారు చేసిన రాఫెల్ జెట్, రష్యా నుంచి సుఖోయ్ జెట్లను దిగుమతి చేసుకున్న తర్వాత.. 23 సంవత్సరాలలో భారతదేశపు మొదటిసారి ప్రధాన యుద్ధ విమానాలను దిగుమతి చేసుకుంది. చైనాతో ఉద్రిక్తతలు నెలకొన్న ఈశాన్య లడఖ్ ప్రాంతంలోనే రఫేల్ యుద్ధ విమానాలు ఉండటం గమనార్హం.

English summary
Indian Air Force Chief RKS Bhadauria today said that Rafale aircraft has caused worries in the Chinese camp. "Of course, it will: IAF Chief RKS Bhadauria on being asked if Rafale aircraft has caused worries in the Chinese camp," reports ANI.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X