జయకు సన్నిహితుడైన సీఎస్ కు శేఖర్ రెడ్డికి లింక్: బినామి నా ?
జయలలిత ఆకస్మిక మరణం తరువాత పన్నీర్ సెల్వం ముఖ్యమంత్రి కావడానికి సీఎస్ రామ్మోహన్ రావు పూర్తిగా సహకరించారని సమాచారం.
చెన్నై: జయలలిత తనకు అత్యంత సన్నిహితుడైన ప్రభుత్వ అధికారి రామ్మోహన్ రావును ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా నియమించారు. ఇదే సంవత్సరంలో రామ్మోహన్ రావు తమిళనాడు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా బాధ్యతలు స్వీకరించారు.
జయలలిత ఆకస్మిక మరణం తరువాత పన్నీర్ సెల్వం ముఖ్యమంత్రి కావడానికి సీఎస్ రామ్మోహన్ రావు పూర్తిగా సహకరించారని సమాచారం. పన్నీర్ సెల్వం సీఎంగా ఇష్టం లేని కొందరు సీనియర్ మంత్రులు శశికళ సీఎం కావాలని నినాదం తెరమీదకు తీసుకు వచ్చారు.
ఇదే సమయంలో పన్నీర్ సెల్వంకు వ్యతిరేకంగా ఉన్న మంత్రులు ఇచ్చిన సమాచారం మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామ్మోహన్ రావు ఇంటి మీద ఐటీ అధికారులు దాడులు చేశారని సమాచారం.

ఇసుక క్వారీల కాంట్రాక్టర్, టీటీడీ బోర్డు మాజీ సభ్యుడు శేఖర్ రెడ్డికి రామ్మోహన్ రావు అన్ని విధాలుగా సహకరించారని ,అందు వలనే రూ. వందల కోట్ల కొత్త నోట్లు అతని దగ్గరకు వెళ్లాయని అన్నాడీఎంకేలోని ఓ వర్గం అంటున్నారు.
గత రెండు రోజుల నుంచి శేఖర్ రెడ్డి, ఆయన బంధువులు కిరణ్ రెడ్డి, ప్రేమ్ రెడ్డి, శ్రీనివాసుల రెడ్డి తదితరులను చెన్నైలోనే ఐటీ అధికారులు విచారణ చేస్తున్నారు. అన్నాడీఎంకేలోని ఓ వర్గానికి చెందిన మంత్రులు, శేఖర్ రెడ్డి ఇచ్చిన సమాచారం మేరకు ఐటీ అధికారులు రామ్మోహన్ రావు ఇంటి మీద దాడులు చేశారని సమాచారం.
రామ్మోహన్ రావు శేఖర్ రెడ్డికి సన్నిహితుడని, అందుకే ఐటీ అధికారులు దాడులు చేశారని అన్నాడీఎంకేకి చెందిన ఓ వర్గం నాయకులు అంటున్నారు. అయితే ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామ్మోహన్ రావుకు శేఖర్ రెడ్డి బినామినా ? శేఖర్ రెడ్డికి, తమిళనాడు సీఎస్ కు ఎప్పటి నుంచి లింక్ ఉంది ? అని ఐటీ అధికారులు ఆరా తీస్తున్నారు.












Click it and Unblock the Notifications