కనికరించిన వెంకయ్య: 15 ఎకరాల అప్పగింత
న్యూఢిల్లీ: సాంసృతిక రాజధాని మైసూరు నగరంలో జిల్లా పరిపాలన కేంద్ర కార్యాలయం నిర్మించడానికి కేంద్ర ప్రభుత్వం 15 ఎకరాల భూమిని మంజూరు చేసింది. ఇక్కడే నూతన భవనాలు నిర్మించి కలెక్టర్ కార్యాలయంతో సహ అన్ని శాఖల కార్యాలయాల భవనాలు నిర్మించనున్నారు.
మైసూరు నగరంలో కొత్త జిల్లా కేంద్ర కార్యాలయం నిర్మించడానికి కర్ణాటక సీఎం సిద్దరామయ్య బడ్డెట్ లో నిధులు మంజూరు చేశారు. స్థలాన్ని పరిశీలించాలని జిల్లా కలెక్టర్ సి. శిఖాకు ఆదేశాలు జారీ చేశారు. మైసూరు నగరంలోని సిద్దార్థ నగరలోని మలేమహదేశ్వర రోడ్డులో కేంద్ర ప్రభుత్వ స్థలం ఉందని గుర్తించారు.

మలేమహదేశ్వర రోడ్డులో 100 ఎకరాల స్థలంలో జర్మన్ ప్రెస్ ఉండేది. అయితే ఆ స్థలాన్ని 1963లో కేంద్ర ప్రభుత్వానికి అప్పగించారు. అప్పటి నుండి ఆ స్థలం ఖాళీగా ఉంది. ఆ స్థలంలో తాము జిల్లా కేంద్ర కార్యాలయం ఏర్పాటు చేసుకుంటామని సిద్దరామయ్య కేంద్ర ప్రభుత్వానికి లేఖ వ్రాశారు.
కేంద్ర పట్టణాభివృద్ది శాఖ మంత్రి ఎం. వెంకయ్య నాయుడు లేఖను పరిశీలించారు. జర్మన్ ప్రెస్ ఉన్న ప్రాంతంలో 15 ఎకరాలు కర్ణాటక ప్రభుత్వానికి అప్పగించడానికి అంగీకరించారు. బుధవారం సిద్దరామయ్య ఢిల్లీ చేరుకుని వెంకయ్య నాయుడు దగ్గర ఆ స్థలానికి సంబంధించి అనుమతి పత్రం తీసుకున్నారు.












Click it and Unblock the Notifications