వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

అమెరికా ఆంక్షల ఎఫెక్ట్ : రష్యాకు రిలయన్స్ షాక్.. చమురు కొనుగోలు దూరం ?

|
Google Oneindia TeluguNews

ఉక్రెయిన్‌పై దురాక్రమణకు దిగిన రష్యాను కట్టడి చేసేందుకు అమెరికాతో పాటు, ఐరోపా దేశాలు తీవ్రంగా ప్రయత్నిస్తున్నాయి. ఆంక్షల చట్రాన్ని భిగుస్తున్నాయి. యుద్ధానికి ముగింపు పలికేందుకు నిబంధనలు కఠినతరం చేశాయి. ఆర్థిక, వ్యాణిజ్య పరమైన ఆంక్షలను విధించారు. రష్యా నుంచి చమురు దిగుమతులు చేసుకోవద్దంటూ ప్రపంచ దేశాలపై ఒత్తిడి తెస్తున్నారు. దీంతో ఇప్పటికే చాలా దేశాలు రష్యా నుంచి చమురు దిగుమతులను నిలిపివేశాయి. దీంతో చమురు ధరలు ఆకాశానికి అంటాయి. చమురు ధరల ప్రభావం దాదాపు అన్ని దేశాలపై పడింది. అటు చమురు కోసం ఐరోపా దేశాలు రష్యాకు ప్రత్యామ్నాయంగా అరబ్ దేశాలతో సంప్రదింపులు జరుపుతున్నాయి.

 ర‌ష్యా నుంచి చ‌మురు కొనుగోలుకు దూరం

ర‌ష్యా నుంచి చ‌మురు కొనుగోలుకు దూరం

రష్యా చమురుపై ఆంక్షల ప్రభావం ఇప్పుడు భారతదేశపు కంపెనీలపై కూడా పడబోతోంది. తాజాగా ప్రపంచంలోనే అతిపెద్ద రిఫైనరీ సంస్థల్లో ఒకటైన రిలయన్స్ ఇండస్ట్రీస్ కీలక నిర్ణయం తీసుకుంది. ప్రస్తుత పరిస్థితుల్లో రష్యా నుంచి చమురు కొనుగోలు చేయాలనుకోవడం లేదని కీలక ప్రకటన చేసింది. ఈ విషయాన్ని రిలయన్స్ కంపెనీ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ రాజేశ్ రావత్ తెలిపినట్లు జాతీయ మీడియా కథనాలు ప్రచురించాయి. ఉక్రెయిన్‌పై దాడుల నేపథ్యంలో అమెరికా, ఐరోపా దేశాలు రష్యా చమురుపై ఆంక్షలు విధించాయి. దీంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆయన వెల్లడించారు.

ఆంక్ష‌ల ప్ర‌భావం..

ఆంక్ష‌ల ప్ర‌భావం..


తమ కంపెనీకి రష్యా నుంచి చమురును దిగుమతి చేసుకునే అవకాశం ఉన్నప్పటికీ .. ఆంక్షల ఉన్నందు వల్ల తాము దానికి దూరంగా ఉండాలని నిర్ణయం తీసుకున్నట్లు రాజేశ్ రావత్ తెలిపారు. రిలయన్ ఇండస్ట్రీస్ గత కొన్నేళ్లుగా అమెరికా, రష్యాతో పాటు ఐరోపా దేశాల నుంచి కూడా పెట్రో కెమికల్ ఫీడ్‌స్టాక్‌ను కొనుగోలు చేస్తోంది. తమ చమురు శుద్ధి కేంద్రాల కోసం రష్యా నుంచి ఉరర్స్ క్రూడ్, నేరుగా ఉపయోగించే చమురును కొంటోంది. అయితే ఉక్రెయిన్‌పై యుద్ధం నేపథ్యంలో రష్యాపై అమెరికా,యూరోపియన్ యూనియన్ దేశాలు ఆంక్షలు విధించాయి. రష్యా నుంచి చమురు దిగుమతులపై ఆంక్షలు విధిస్తూ ప్రపంచ దేశాలపై అందుకు తగ్గట్టుగా ఒత్తిడి తెస్తున్నాయి. ఈ నేపథ్యంలో రిలయన్స్ కొనుగోలు చేయకూడదని నిర్ణయిం తీసుకుంది.

రష్యా నుంచి ఐవోసీ కొనుగోలు

రష్యా నుంచి ఐవోసీ కొనుగోలు


ఆంక్షల నేపథ్యంలో భారత్‌కు చిరకాల మిత్రదేశంగా ఉన్న రష్యా.. ఆఫర్ ఇచ్చింది. చమురు ధరలను తగ్గించి సరఫరా చేసేందుకు నిర్ణయించింది. దీంతో రష్యా నుంచి భారత్ 30 లక్షల బ్యారెళ్ల ముడి చమురును చౌకధరకే కొనుగోలు చేసింది. ఈమేరకు ఒక ట్రేడర్ ద్వారా ఇండియన్ అయిల్ కార్పొరేషన్ ఒప్పందం చేసుంది. అటు రష్యా నుంచి చమురు కొనుగోలు చేయవద్దంటూ భారత్‌పై కూడా అమెరికా ఒత్తిడి చేస్తోంది. భారత్ తన చమురు అవసరాల కోసం చాలా వరకు దిగుమతి చేసుకుంటుందని విదేశాంగ శాఖ అధికార ప్రతినిథి అరిందమ్ బాగ్చీ స్ప‌ష్టం చేశారు.. ప్రపంచంలోని అన్ని ఇంధన మార్కెట్లలో ఉన్న అవకాశాలను తాము ఎల్లప్పుడూ పరిశీస్తోందని చెప్పారు. తమకు రష్యానే ప్రధాన సరఫరాదారు కాదని పేర్కొన్నారు.

English summary
Reliance Industries may decides not to buy oil from Russia ?
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X