బెంగళూరు ఐటీ కంపెనీపై ఈడీ దాడులు: రూ. 6.50 కోట్లు సీజ్
బెంగళూరులోని ఇగ్నీష్ టెక్నాలజీస్ అనే ప్రముఖ ఐటీ కంపెనీలో ఈడీ అధికారులు సోదాలు చేసి ఆ కార్యాలయంలో ఉన్న రూ. 6.50 కోట్ల అక్రమ ఆస్తిని స్వాధీనం చేసుకున్నారు.
బెంగళూరు: పెద్ద నోట్లు రద్దు అయిన తరువాత ఐటీ శాఖ అధికారులు, ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) అధికారులు అక్రమాస్తులు ఉన్న వారి మీద నిఘా వేసి దాడులు చేస్తున్నారు. బెంగళూరు నగరంలోని ప్రముఖ ఐటీ కంపెనీ మీద అధికారులు పంజా విసిరారు.
బెంగళూరులోని ఇగ్నీష్ టెక్నాలజీస్ అనే ప్రముఖ ఐటీ కంపెనీలో గురువారం ఈడీ అధికారులు సోదాలు చేశారు. ఆ కార్యాలయంలో ఉన్న రూ. 6.50 కోట్ల అక్రమ ఆస్తిని గుర్తించి స్వాధీనం చేసుకున్నారు.
సాఫ్ట్ వేర్ కంపెనీ, ఆ సంస్థ డైరెక్టర్ నిహాల్ రంజన్ సమథార మీద అక్రమంగా ఆస్తులు సంపాదించారని, బ్లాక్ మనీ తరలించడానికి ప్రయత్నించారని కేసులు నమోదు చేశామని ఈడీ అధికారులు తెలిపారు.

ఏరో స్పేస్ ఇంజనీరింగ్ కు చెందిన ఈ కంపెనీతో పాటు ఇతర కంపెనీ మీద ఈడీ అధికారులు దాడులు నిర్వహిస్తున్నారు. షేర్లు, భూములు, కట్టడాలతో ఇతర ఆస్తుల ప్రతాలను అధికారులు స్వాధీనం చేసుకున్నారు.
ఈ కంపెనీలకు చెందిన వివిధ ప్రాంతాల్లోని కార్యాలయాల్లో ఈడీ అధికారులు దాడులు చేశారు. మొత్తం రూ. 6.50 కోట్ల విలువైన అక్రమ ఆస్తులు స్వాధీనం చేసుకుని కంపెనీ నిర్వహకులను విచారిస్తున్నామని ఈడీ అధికారులు తెలిపారు.












Click it and Unblock the Notifications