వంట గ్యాస్‌ కొరత, వారికి నిలిపివేత- ప్రభుత్వం తాజా మార్గదర్శకాలు..!!

వంట గ్యాస్ సమస్య పెరుగుతోంది. పశ్చిమాసియాలో కొనసాగుతున్న ఉద్రిక్త పరిస్థితులు ప్రపంచ ఇంధన సరఫరా వ్యవస్థపై ప్రభావం చూపుతున్న నేపథ్యంలో గ్యాస్ సరఫరా పైన ప్రభావం చూపింది. వాణిజ్య వంటగ్యాస్‌ సిలిండర్ల కొరత కొనసాగుతోంది. పలు నగరాల్లో 20 శాతానికి పైగా హోటళ్లు మూసివేసారు. గృహ అవసరాలకు వినియోగించే గ్యాస్ ధరలు పెంచటంతో పాటుగా బుకింగ్.. సరఫరా విషయంలో కొత్తగా మార్గదర్శకాలు జారీ అయ్యాయి. గ్యాస్ సమస్య పైన కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది.

పశ్చిమాసియాలో ఉద్రిక్త పరిస్థితుల కారణంగా వంట గ్యాస్ కొరత కనిపిస్తోంది. గృహ అవసరాలకు ఉపయోగించే వంటగ్యాస్ సరఫరాకే కేంద్ర ప్రభుత్వం అత్యధిక ప్రాధాన్యం ఇస్తోంది. మార్గదర్శకా లను విడుదల చేసింది. ఒక సారి గ్యాస్ సిలిండర్ తీసుకున్న తరువాత 25 రోజులకు మాత్రమే మరో సిలిండర్ కోసం బుక్ చేయాలని నిర్దేశించింది. వంట గ్యాస్ డిమాండ్ వేళ ధరలను భారీగా పెంచింది. ఇదే పరిస్థితి మరో వారం కొనసాగితే గ్యాస్ కొరత ఖాయంగా కనిపిస్తోంది. ఇదే సమయం లో వాణిజ్య వంటగ్యాస్‌ సిలిండర్ల కొరత నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం కీలక చర్యలు చేపట్టింది. గ్యాస్ సరఫరా పరిస్థితిని సమీక్షించేందుకు కేంద్ర చమురు మంత్రిత్వశాఖ ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేసింది. చమురు మార్కెటింగ్ కంపెనీలకు చెందిన ముగ్గురు ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్లతో కమిటీని ఏర్పాటు చేసినట్లు కేంద్రం వెల్లడించింది.

oil-ministry-has-constituted-a-committee-to-examine-supply-issues-after-a-sudden-shortage-of-commerc

కేంద్రం పర్యవేక్షణ.. కీలక మార్గదర్శకాలు

ప్రస్తుతం వాణిజ్య ఎల్‌పీజీ సిలిండర్ల సరఫరా కొన్ని నగరాల్లో తీవ్రంగా తగ్గింది. ముఖ్యంగా ముంబయి, బెంగళూరు, దిల్లీ వంటి మెట్రో నగరాల్లో హోటళ్లు, రెస్టారెంట్లు గ్యాస్ కొరతతో ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయి. హోర్ముజ్ జలసంధి మూసివేయడం వల్ల సౌదీ అరేబియా వంటి దేశాల నుంచి భారత్‌కు వచ్చే ఎల్‌పీజీ దిగుమతులకు ఆటంకం ఏర్పడింది. దీంతో పరిమిత సరఫరా పరిస్థితుల్లో గృహ వినియోగదారులకు ప్రాధాన్యం ఇవ్వాల్సిన పరిస్థితి ఏర్పడిందని కేంద్రం తెలిపింది. అదేవిధంగా దిగుమతి చేసుకున్న ఎల్‌పీజీని గృహేతర విభాగాల్లో ఆసుపత్రులు, విద్యాసంస్థలు వంటి అత్యవసర సేవలకు ప్రాధాన్య క్రమంలో సరఫరా చేస్తున్నట్లు తెలిపింది. వాణిజ్య సిలిండర్ల సరఫరా తగ్గడం హోటల్, ఆహార పరిశ్రమలపై తీవ్ర ప్రభావం చూపుతోంది. అదనంగా ఉత్పత్తి అయ్యే గ్యాస్‌ను ప్రధానంగా గృహ వినియోగానికి మళ్లించాలని కేంద్రం తాజాగా ఆయిల్ మంత్రిత్వ శాఖకు సూచించింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+