ఎంగేజ్‌మెంట్‌కు ఎండ్ కార్డ్.. లవ్ స్టోరీకి సీక్వెల్?

టీమిండియా యువ క్రికెటర్ పృథ్వీ షా, ప్రముఖ ఇన్‌ఫ్లుయెన్సర్, నటి ఆకృతి అగర్వాల్‌ల బంధం అర్ధాంతరంగా ముగియడంపై సోషల్ మీడియాలో రకరకాల ఊహాగానాలు చక్కుర్లు కొడుతున్నాయి. ఈ ఏడాది మార్చి 8న వీరికి ఎంతో ఘనంగా ఎంగేజ్మెంట్ జరిగినప్పటికీ.. కొన్ని నెలల్లోనే పరస్పర అంగీకారంతో ఈ బంధానికి స్వస్తి పలికారు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో ఆకృతి అగర్వాల్ తమ బ్రేకప్‌తో పాటు క్రికెటర్ తో ప్రస్తుత సంబంధాలపై సంచలన విషయాలను పంచుకున్నారు.

రామాయణ మూవీ అఫీషియల్ రిలీజ్ డేట్ వచ్చేసింది
రామాయణ మూవీ అఫీషియల్ రిలీజ్ డేట్ వచ్చేసింది

పృథ్వీ షాతో ఎంగేజ్మెంట్ రద్దయిన తర్వాక కూడా ఇద్దరి మధ్య మాటలు కొనసాగుతున్నాయా అని ప్రశ్నించగా.. "మేము ఇప్పటికీ అప్పుడప్పుడు మాట్లాడుకుంటాం. మా ఇద్దరి జీవితాల్లో ఏం జరుగుతుందో తెలుసుకుంటూ ఉంటాం. కేవలం మేమిద్దమే కాదు.. మా కుటుంబాలు కూడా ఒకరికొకరు ఎంతో దగ్గరయ్యాయి. నేటికీ పృథ్వీ షాకు మా కుటుంబంతో మంచి అనుబంధం ఉంది. ఈ బంధానికి నేను చాలా విలువ ఇస్తాను. ప్రస్తుతం మా దారులు వేరైనప్పటికీ.. అతడి జీవితంలో అంతా మంచి జరగాలని కోరుకుంటున్నాను" అని ఆకృతి అగర్వాల్ స్పష్టం చేశారు.

Aakriti Agarwal Breaks Silence on Breakup with Prithvi Shaw Here is What She Revealed Full Details

విడిపోవడానికి గల కారణాలను వివరిస్తూ.. తమ మధ్య ప్రేమ తగ్గలేదని ఆమె వెల్లడించారు. "మా మధ్య ప్రేమ లేదని అనుకోవద్దు, ఇప్పటికీ మేము ఒకరినొకరు ఎంతగానో ప్రేమిస్తాం, గౌరవించుకుంటాం. ఎందుకంటే మేమిద్దరం కలిసి ఓ అందమైన బంధాన్ని గడిపాం. కాకపోతే కొన్ని వ్యక్తిగత విషయాలు సర్దుబాటు కాకపోవడంతో ఈ నిర్ణయం తీసుకోవాల్సి వచ్చింది. అతను తన జీవితంలో మరింత ఎత్తుకు ఎదగాలని ఆశిస్తున్నాను" అని ఆకృతి అగర్వాల్ పేర్కొన్నారు.

IND vs WI: అభిషేక్ విధ్వంసం.. భారత్ విజయం!
IND vs WI: అభిషేక్ విధ్వంసం.. భారత్ విజయం!

అలాగే కేవలం ఫేమ్, డబ్బు కోసమే పృథ్వీ షాతో బంధాన్ని ఏర్పరచుకుందనే ట్రోల్స్‌ను ఆకృతి అగర్వాల్ తీవ్రంగా ఖండించారు. ఎవరైనా సరే డబ్బు చూసే సంబంధం కలుపుకోవాల్సిన అవసరం లేదని.. ప్రేమ, ఎదుటి వ్యక్తి చూపించే శ్రద్ధ, ఆప్యాయతలే ముఖ్యమని చెప్పారు. సెలబ్రిటీల ప్రైవేట్ లైఫ్ గురించి వచ్చే రూమర్లకు ఈ కామెంట్లతో ఆమె చెక్ పెట్టారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+