స్థానిక సంస్థల ఎన్నికల వేళ ఐఏఎస్ ల బదిలీలు- అమ్రాపాలి కి కీలక బాధ్యతలు..!!

ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికలకు రంగం సిద్దమైంది. ఈ నెల 14న ఎన్నికల షెడ్యూల్ విడుదల కానుంది. రిజర్వేషన్లు ఇప్పటికే ఖరారయ్యాయి. పార్టీలు తమ అభ్యర్ధుల ఖరారు పైన కసరత్తు చేస్తున్నాయి. ఇదే సమయంలో ప్రభుత్వం కీలక నిర్ణయాలు తీసుకుంటోంది. రాష్ట్రంలో 11 మంది ఐఏఎస్ ల బదిలీ.. పోస్టింగ్స్ పైన ఉత్తర్వులు జారీ చేసింది. ఐఏఎస్ అమ్రాపాలీకి కీలక బాధ్యతలు ప్రభుత్వం కేటాయించింది.

స్థానిక సంస్థల ఎన్నికల వేళ పరిపాలనా విభాగంలో కీలక మార్పులు చోటుచేసుకున్నాయి. పలువురు ఐఏఎస్‌ అధికారులకు కొత్త పోస్టింగులు కల్పించడంతోపాటు, మరికొందరికి పూర్తి అదనపు బాధ్యతలు (ఎఫ్‌ఏసీ) అప్పగిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. మొత్తం 11 మంది అధికారులకు వివిధ శాఖల్లో బాధ్యతలు అప్పగించారు. ఈ నియామకాలు తక్షణమే అమల్లోకి వస్తాయని ప్రభుత్వం ఉత్తర్వుల్లో పేర్కొంది.

ap-govt-issues-orders-for-ias-transfers-and-postings-ahead-local-body-elections-here-the-details

న్యూఢిల్లీలోని ఆంధ్రప్రదేశ్‌ భవన్‌లో ప్రత్యేక విధుల అధికారిగా సౌరభ్‌ గౌర్‌ను నియమించింది. గిరిజన సంక్షేమ శాఖ కార్యదర్శిగా డి. మురళీధర్‌రెడ్డికి బాధ్యతలు అప్పగించింది. ఆర్థికంగా వెనుకబడిన వర్గాల సంక్షేమ శాఖ అదనపు కార్యదర్శిగా మంజుల బాలాజీ దిగంబర్‌ను నియమించింది. పర్యాటక, సాంస్కృతిక శాఖ కార్యదర్శిగా అమ్రపాలి కటాను నియమిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఆమెకు సంబంధిత శాఖల బాధ్యతలు అప్పగించింది.

 జనసేన -బీజేపికి దక్కే మేయర్, మున్సిపల్ సీట్లు ఫైనల్: ఎవరికి ఎక్కడ..!!
జనసేన -బీజేపికి దక్కే మేయర్, మున్సిపల్ సీట్లు ఫైనల్: ఎవరికి ఎక్కడ..!!

ఎన్నికల కసరత్తు.. అధికారులకు బాధ్యతలు

అదే విధంగా యువజన సేవల డైరెక్టర్‌గా నీలకంఠరెడ్డిని నియమించింది. పరిశ్రమలు, వాణిజ్య శాఖ జాయింట్‌ సెక్రటరీగా బి. అనిల్‌ కుమార్‌రెడ్డికి పోస్టింగ్‌ ఇచ్చింది. ఏపీ సాంఘిక సంక్షేమ గురుకుల విద్యాసంస్థల సొసైటీ కార్యదర్శిగా ఎన్‌. తేజ్‌భరత్‌ను నియమించింది. స్వర్ణ గ్రామం, స్వర్ణ వార్డు శాఖ డిప్యూటీ సెక్రటరీగా గెడెల శ్రీనుకుమార్‌కు బాధ్యతలు అప్పగించింది.

ఇక ఏపీ రాష్ట్ర పౌరసరఫరాల సంస్థ వైస్‌ చైర్మన్‌, మేనేజింగ్‌ డైరెక్టర్‌గా ఎం. వరప్రసాద్‌ను నియమించింది. ఉద్యానవన, పట్టు పరిశ్రమల శాఖ డైరెక్టర్‌గా ఉన్న డాక్టర్‌ కె. శ్రీనివాసులుకు వ్యవసాయ మార్కెటింగ్‌ శాఖ డైరెక్టర్‌గా పూర్తి అదనపు బాధ్యతలు అప్పగించింది. పరిశ్రమల శాఖ డైరెక్టర్‌గా ఉన్న శుభమ్‌ బన్సల్‌కు ఏపీ రాష్ట్ర ఆర్థిక సంస్థ మేనేజింగ్‌ డైరెక్టర్‌గా ఎఫ్‌ఏసీ బాధ్యతలు కేటాయించింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+