అమరావతి రైల్వే లైన్ నిర్మాణంపై కీలక అప్డేట్!
ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతికి రైలు కనెక్టివిటీ కల్పించే ప్రాజెక్ట్ వేగంగా ముందుకు సాగుతోంది. రాజధాని అమరావతిని అన్ని విధాలా అభివృద్ధి చేసే పనిలో ఉన్న కూటమి సర్కార్ ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతికి ప్రత్యక్ష రైలు సౌకర్యం కల్పించే ఎర్రుపాలెం-అమరావతి-నంబూరు కొత్త బ్రాడ్‌గేజ్ రైల్వే లైన్ ప్రాజెక్ట్ పనులలో వేగం పెంచుతోంది.
ఎర్రుపాలెం-అమరావతి-నంబూరు మధ్య 57 కిలోమీటర్ల కొత్త బ్రాడ్ గేజ్ రైల్వే లైన్ నిర్మాణానికి రైల్వే శాఖ ప్రణాళికలు సిద్ధం చేసింది. మొత్తం అంచనా వ్యయం రూ.2,047 కోట్లు. 2024లో కేంద్ర క్యాబినెట్ ఆమోదం పొందిన ఈ కొత్త బ్రాడ్ గేజ్ రైల్వే లైన్ ఈపీసీ విధానంలో నిర్మించనున్నారు.2028 చివరి నాటికి లేదా 2029 ఆరంభం నాటికి ఈ రైల్వే లైన్ ను పూర్తి చెయ్యాలని లక్ష్యంగా పెట్టుకున్నారు.

ఈ ప్రాజెక్ట్ ను నాలుగు ప్యాకేజీలుగా విభజించారు.ఎర్రుపాలెం - కొత్తపల్లి సుమారు 21 కి.మీ మొదటి ప్యాకేజీ కాగా,.కొత్తపల్లి - వడ్డమాను కృష్ణా నది మీదుగా 3.2 కి.మీ. భారీ వంతెన - 53×61 మీటర్ల స్పాన్లు రెండో ప్యాకేజీ, వడ్డమాను - అమరావతి - నంబూరు 28.35 కి.మీ. - రూ. 599.33 కోట్లతో టెండర్లు ఆహ్వానం మూడు, నాలుగు ప్యాకేజీలు .మూడు ప్యాకేజీల టెండర్ల ప్రక్రియ ఇప్పటికే ముగిసింది.
నాలుగో ప్యాకేజీగా వడ్డమాను నుంచి నంబూరు వరకు 28.35 కిలోమీటర్ల విభాగానికి రూ.599.33 కోట్లతో టెండర్లు ఆహ్వానించారు. బిడ్లు సమర్పించేందుకు నవంబర్ 23 వరకు గడువు ఉంది. ఈపీసీ విధానంలో నిర్మాణం జరుగుతుంది. కృష్ణా నది మీదుగా 3.2 కిలోమీటర్ల వంతెన కూడా ఇందులో భాగంగా నిర్మించనున్నారు . మొత్తం తొమ్మిది కొత్త రైల్వే స్టేషన్లు నిర్మించనున్నారు.
ఈ లైన్ నిర్మాణానికి, అలాగే ఓఆర్ఆర్ నిర్మాణానికి కూడా భూసేకరణ వేగంగా జరుగుతుంది. ఈ రైల్వే లైన్ పూర్తయితే అమరావతి నుంచి హైదరాబాద్, విజయవాడ, గుంటూరు, చెన్నై, బెంగళూరు వంటి ప్రధాన నగరాలకు ప్రత్యక్ష రైలు సౌకర్యం లభిస్తుంది. ప్రయాణికులు, సరుకు రవాణాకు గొప్ప సౌకర్యం కలుగుతుంది. రాజధాని అభివృద్ధికి ఇది కీలక మైలురాయిగా నిలుస్తుందని అధికారులు అభిప్రాయపడుతున్నారు.













Click it and Unblock the Notifications
