ఏపీలో రూ.49, రూ.50లకే బియ్యం పంపిణీ.. ధరల టెన్షన్ కు రైతుబజార్లతో చెక్!

ఎల్ నినో ప్రభావంతో దేశవ్యాప్తంగా నిత్యావసర వస్తువుల ధరలు విపరీతంగా పెరిగాయి. ఏం కొనేటట్టు లేదు, ఏం తినేటట్టు లేదు అన్నట్టు ఉంది పరిస్థితి. ఇదే క్రమంలో బియ్యం ధరలు కూడా కొండెక్కి కూర్చున్నాయి. దీంతో సామాన్యులు సన్నబియ్యం కొనాలంటే కొనలేని పరిస్థితి వచ్చింది. ఆంధ్రప్రదేశ్‌లో బహిరంగ మార్కెట్‌లో బియ్యం ధరలు పెరిగిపోతుండడంతో సామాన్య ప్రజలకు ఉపశమనం కలిగించేందుకు ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.

రాష్ట్రవ్యాప్తంగా రైతు బజార్లలో నాణ్యమైన కేఎన్ఎం (KNM) రకం సన్నబియ్యాన్ని కిలో రూ.50కే, బీపీటీ రకాన్ని రూ.49కే విక్రయించడం ప్రారంభించింది. పౌరసరఫరాల శాఖ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నేటి నుంచి అమల్లోకి వచ్చింది. విజయవాడ భవానీపురం రైతు బజార్‌లో ఉదయం 10.30 గంటలకు పౌర సరఫరాల శాఖా మంత్రి నాదెండ్ల మనోహర్ సన్న బియ్యం పంపిణీ ప్రారంభించారు. రైతు బజార్లలో ప్రత్యేక కౌంటర్లు ఏర్పాటు చేసి, దళారుల ప్రమేయం లేకుండా నేరుగా ప్రజలకు అందిస్తున్నారు.

Fine rice in rythu bazars ap Government Sells KNM Quality Rice at 49-50 per kg in Rythu Bazars

వినియోగదారులకు నాణ్యమైన బియ్యం సరసమైన ధరలకు అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకుంటున్నాం అని మంత్రి నాదెండ్ల మనోహర్ తెలిపారు. ఓపెన్ మార్కెట్‌లో సన్నబియ్యం కిలో రూ.60-65 వరకు ఉండగా, ప్రభుత్వం తక్కువ ధరకే నాణ్యమైన బియ్యం అందించడం వల్ల పేద, మధ్యతరగతి కుటుంబాలకు గణనీయమైన ఉపశమనం లభిస్తుంది. ఒక్కో కుటుంబానికి నెలకు 26కిలోల ప్యాక్ వరకు కొనుగోలు చేసుకునే అవకాశం ఉంది.

ఆధార్ లేదా రేషన్ కార్డు తీసుకెళ్ళి నేరుగా బియ్యం పొందవచ్చు. ఈ బియ్యం పంపిణీ పారదర్శకంగా జరుగుతోంది. మొదటి రోజే ప్రజల నుంచి మంచి స్పందన వచ్చింది. క్యూలైన్లలో నిలబడి ప్రజలు నేరుగా బియ్యాన్ని కొనుగోలు చేస్తున్నారు. బ్లాక్ మార్కెటింగ్‌ను నివారించేందుకు అధికారులు నిఘా పెంచారు.

కేబీఆర్ పార్క్ ఎలివేటేడ్ కారిడార్ కోసం కోట్ల విలువైన ఇంటి స్థలం ఇస్తున్న బాలకృష్ణ!
కేబీఆర్ పార్క్ ఎలివేటేడ్ కారిడార్ కోసం కోట్ల విలువైన ఇంటి స్థలం ఇస్తున్న బాలకృష్ణ!

ఈ నిర్ణయం వల్ల మార్కెట్ ధరలు కూడా స్థిరపడే అవకాశం ఉందని అధికారులు అంటున్నారు. ప్రజలు సమీప రైతు బజార్‌కు వెళ్లి కొనుగోలు చేసుకోవచ్చు. సామాన్య ప్రజలకు ఊరట కల్పిస్తూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తీసుకున్న కీలక నిర్ణయం ఏపీ ప్రజలకు భారీ ఉపశమనం కల్పిస్తుంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+