నౌకాదళంలో శక్తిమంతమైన యాంటీ సబ్‌మెరైన్ ఎంట్రీ- హిందూ మహాసముద్రంపై డేగకన్ను

దేశ సముద్ర రక్షణ సామర్థ్యాలు మరో నూతన మైలురాయికి చేరుకున్నాయి. తీరప్రాంత జలాల్లో శత్రు జలాంతర్గాముల కదలికలను సమర్థవంతంగా అడ్డుకోవడానికి ఉద్దేశించిన ఐఎన్ఎస్ మంగ్రోల్ యుద్ధనౌక ముంబై తీరంలో జల ప్రవేశం చేసింది. నౌకాదళంలోకి ఎంట్రీ ఇచ్చింది. యాంటీ సబ్‌మెరైన్ వార్‌ఫేర్ షాలో వాటర్ క్రాఫ్ట్ ప్రాజెక్ట్ లో భాగంగా నిర్మించిన యుద్ధ నౌక ఇది. ఈ సిరీస్ లో మొత్తం ఎనిమిది యాంటీ సబ్ మెరైన్ వార్ షిప్ లు రూపుదిద్దుకుంటోన్నాయి. ఇందులో ఇది మూడోది.

సాధారణంగా పరిమాణంలో పెద్దవిగా ఉండే భారీ యుద్ధనౌకలు లోతు తక్కువగా ఉండే తీర ప్రాంత జలాల్లో వేగంగా కార్యకలాపాలు నిర్వహించలేవు. అటువంటి వ్యూహాత్మక ప్రాంతాల్లో భద్రతను కట్టుదిట్టం చేయడానికి ఈ రకం నౌకలు ఉపయోగపడతాయి. ముంబైలోని వెస్ట్రన్ నావల్ కమాండ్ ప్రధాన కార్యాలయంలో జరిగిన కార్యక్రమం సందర్భంగా వెస్ట్రన్ నావల్ కమాండ్ ఫ్లాగ్ ఆఫీసర్ కమాండింగ్ ఇన్ చీఫ్ వైస్ అడ్మిరల్ సంజయ్ వత్సయాన్ సమక్షంలో ఈ కమిషనింగ్ ప్రక్రియ పూర్తయింది.

INS Mangrol Commissioned in Mumbai to Boost Indian Navy Anti-Submarine Power in Coastal Waters

ప్రస్తుతం నెలకొన్న అంతర్జాతీయ సముద్రజలాల భద్రతా పరిణామాల నేపథ్యంలో భారత తీర ప్రాంతాల వద్ద ఉద్రిక్త పరిస్థితులు క్రమంగా పెరుగుతున్నాయి. ఈ కీలక తరుణంలో ఐఎన్ఎస్ మంగ్రోల్ చేరిక దేశ తీరప్రాంతాలు, ప్రధాన నౌకాశ్రయాలు, వాణిజ్య నౌకల రాకపోకలకు రక్షణ కవచంగా మారుతుందని నౌకాదళాధికారులు వెల్లడించారు.

బంగారం ధరలు అనూహ్యంగా తలకిందులు- గట్టిగా దెబ్బకొట్టిన సౌదీ అరేబియా పరిణామాలు
బంగారం ధరలు అనూహ్యంగా తలకిందులు- గట్టిగా దెబ్బకొట్టిన సౌదీ అరేబియా పరిణామాలు

కేరళలోని కొచ్చిన్ షిప్‌యార్డ్ లిమిటెడ్ ఐఎన్ఎస్ మంగ్రోల్ రూపుదిద్దుకుంది. కేంద్ర ప్రభుత్వం చేపట్టిన ఆత్మనిర్భర్ భారత్ లో భాగంగా ఈ నౌక నిర్మాణంలో దాదాపు 80 శాతానికి పైగా స్వదేశీ పరిజ్ఞానాన్ని, స్థానిక విడిభాగాలను ఉపయోగించారు. ఇది రక్షణ రంగంలో భారత్ సాధిస్తున్న స్వయంసమృద్ధికి నిలువెత్తు నిదర్శనంగా మారింది. మూడు శక్తివంతమైన డీజిల్ ఇంజిన్లు, వాటర్ జెట్ ప్రొపల్షన్ సిస్టమ్‌తో నడుస్తుందీ వార్ షిప్.

లోతు తక్కువ ఉన్న జలాల్లో సైతం అత్యంత వేగంగా ప్రయాణించగలుగుతుంది. సులువుగా కదలగలుగుతుంది. శత్రు దేశాల జలాంతర్గాముల కదలికలను పసిగట్టడానికి ఈ నౌకలో అత్యాధునిక ఆయుధాలు, సెన్సార్లను అమర్చారు. స్వదేశీ పరిజ్ఞానంతో రూపొందించిన అభయ్ హల్ మౌంటెడ్ సోనార్ సిస్టమ్, లైట్ వెయిట్ టోర్పెడో, యాంటీ సబ్‌మెరైన్ రాకెట్ లాంచర్లు ఉన్నాయి. వీటితో పాటు శత్రుదేశాల టోర్పెడో దాడుల నుండి నౌకను కాపాడుకోవడానికి మారీచ్ అడ్వాన్స్‌డ్ టోర్పెడో డికాయ్ సిస్టమ్‌ను కూడా పొందుపరిచారు.

గుజరాత్‌లోని జునాగఢ్ జిల్లాలో ఉన్న తీరప్రాంత మత్స్యకార పట్టణం.. మంగ్రోల్. ఆ పేరునే ఈ నౌకకు పెట్టారు. సముద్ర సరిహద్దుల్లో నిరంతరం నిఘా పెట్టే మెరైన్ పెట్రోల్ విమానాలు, రక్షణ హెలికాప్టర్లు, ఇతర ప్రధాన యుద్ధనౌకలతో పూర్తిస్థాయి సమన్వయం చేసుకుంటూ తన బాధ్యతలను నిర్వర్తిస్తుందీ ఐఎన్ఎస్ మంగ్రోల్. ఓడరేవులు, తీరప్రాంత మౌలిక సదుపాయాల భద్రతను నిరంతరం పర్యవేక్షించడం దీని ముఖ్య లక్ష్యం. హిందూ మహాసముద్ర ప్రాంతంలో మన సముద్ర సరిహద్దుల భద్రతను పటిష్టం చేయడంలో కీలకంగా మారనుంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+