"ఒక్క జ్ఞానేష్ కోసం ఇంతమందితో మోడీ పోరెందుకో ?"- అభిజీత్ దిప్కే ప్రశ్న..!
ఎస్ఐఆర్ అక్రమాల నేపథ్యంలో సీఈసీ జ్ఞానేష్ కుమార్ రాజీనామా కోరుతూ విపక్షాలు, విద్యార్దులు, కాక్రోచ్ జనతా పార్టీ, ప్రజా సంఘాలు, జర్నలిస్టులు ఇలా పలు వర్గాలు ఢిల్లీ సహా పలు రాష్ట్రాల్లో పోరాటాలు చేస్తున్నా కేంద్రం కానీ, ప్రధాని మోడీ కానీ వెనక్కి తగ్గడం లేదు. గతంలో నీట్ అక్రమాల వ్యవహారంలో ధర్మేంద్ర ప్రధాన్ తరహాలో రాజీనామా చేయించేందుకు మొగ్గు చూపడం లేదు. దీంతో పాటు ఢిల్లీలో ఆందోళనలు చేస్తున్న వారిపై పోలీసుల సాయంతో ఉక్కుపాదం మోపుతున్నారు. ఈ నేపధ్యంలో సీఈసీ జ్ఞానేష్ కుమార్ కు ప్రదాని మోడీ ఇస్తున్న మద్దతును కాక్రోచ్ జనతా పార్టీ జాతీయ కన్వీనర్ అభిజీత్ దిప్కే (Abhijeet Dipke)ప్రశ్నించారు.
ఢిల్లీ పోలీసులు యువతపై, పాత్రికేయులపై, చివరికి ఎంపీలపై కూడా దాడులకు పాల్పడుతున్నారని, జ్ఞానేష్ కుమార్‌ను కాపాడుకోవడం కోసం అందరితోనూ పోరాడటానికి సిద్ధపడేంతగా, ఆయన మోదీకి అంత అనివార్యమైన వ్యక్తిగా ఎలా మారారు? అంటూ కాక్రోచ్ జనతా పార్టీ బాస్ అభిజీత్ దిప్కే ప్రశ్నించారు. ఈ మేరకు ఆయన ఇవాళ ఓ ట్వీట్ చేశారు. ఇందులో ఆయన ఢిల్లీలో పోలీసులు చేస్తున్న దాడుల్ని తప్పుబట్టడంతో పాటు ప్రధాని మోడీ సీఈసీ జ్ఞానేష్ కుమార్ కు ఇస్తున్న మద్దతును నిలదీశారు.

మరోవైపు ఢిల్లీ పోలీసులు నిరసనకారుల్ని నిర్బంధించే పేరుతో సిక్కుల దేవాలయం బంగ్లా సాహిబ్ లోకి బూట్లతో వెళ్లడాన్ని సీజేపీ తప్పుబట్టింది. సిక్కు సోదర సోదరీమణులు ఎల్లప్పుడూ యువతకు మద్దతుగా నిలిచారని, వారు మతం, కులం, వర్గం లేదా జాతి ఆధారంగా ఎవరినీ ఎన్నడూ వివక్షకు గురిచేయలేదు లేదా అంచనా వేయలేదని సీజేపీ నేత సౌరవ్ దాస్ తెలిపారు. ఢిల్లీ పోలీసులు బూట్లతో, తలకు కప్పుకోకుండా, ఆయుధాలతో బంగ్లా సాహిబ్‌లోకి బలవంతంగా ప్రవేశించడం తీవ్రంగా ఖండనీయమన్నారు. ఎవరెవరు ఏ సిద్ధాంతానికి చెందినవారైనా సరే, మన ప్రార్థనా స్థలాలను ఈ విధంగా ఎన్నడూ అవమానించకూడదన్నారు. సిక్కు సోదర సోదరీమణులు మాత్రమే కాకుండా, ప్రతి ఒక్కరూ పెద్ద సంఖ్యలో యువతకు మద్దతు ఇవ్వాలని ఆయన అభ్యర్ధించారు. ఇది జవాబుదారీతనం కోసం, స్వచ్ఛమైన వ్యవస్థ కోసం, ఉజ్వల భవిష్యత్తు కోసం చేసే ఉమ్మడి పోరాటం అన్నారు.














Click it and Unblock the Notifications
