2 డోసులు తీసుకున్నా.. వృద్దురాలి మృతి.. ఎక్కడ అంటే
కరోనాకు సంజీవని వ్యాక్సిన్.. ఇదే విషయాన్ని నిపుణులు చెబుతున్నారు. కానీ కొన్ని సందర్భాల్లో వ్యాక్సిన్ తీసుకున్న చనిపోతున్నారు. ముంబైలో రెండు డోసుల వ్యాక్సిన్లు తీసుకున్నా ఓ వృద్ధురాలు కరోనా మహమ్మారి బారినపడి చనిపోయారు. ఆమెలో డెల్టా ప్లస్ రకం కరోనా వైరస్ ఉందని తర్వాత తేలింది. దాంతో ముంబైలో డెల్టా ప్లస్ రకం కరోనా వైరస్‌తో తొలి మరణం సంభవించినట్టు అయ్యింది. గత నెల 21వ తేదీన ఓ 63 ఏండ్ల వృద్ధురాలికి కరోనా పాజిటివ్ వచ్చింది.
అయితే అప్పటికే ఆమె రెండు డోసుల వ్యాక్సిన్ తీసుకున్నారు. అయినా ఆమెకు మహమ్మారి సోకింది. కరోనా వైరస్‌కు తోడు అంతకుముందే ఆమె ఊపిరితిత్తులు, వాయునాళం సమస్యలతో కూడా బాధపడుతున్నారు. దీంతో వ్యాధి తీవ్రత మరింత ఎక్కువైంది. పరిస్థితి విషమించి గత నెల 27న వృద్ధురాలు మరణించింది. వృద్ధురాలు కాకుండా ఆమె కుటుంబంలో మరో ఆరుగురికి కూడా కరోనా పాజిటివ్ వచ్చింది. వారిలో ఇద్దరికి డెల్టా ప్లస్ వేరియంట్ ఉన్నట్లు తేలింది. మరో నలుగురిలో ఉన్న వైరస్ రకం తేలాల్సి ఉన్నది.

ఇటు వేసవిలోనే కరోనా వైరస్ ప్రభావం ఎక్కువగా ఉంటోంది. గతేడాది సమ్మర్‌లో కరోనా ఇంపాక్ట్ ఎక్కువగానే ఉంది. ఈ సారి సెకండ్ వేవ్ వల్ల యువత పిట్టల్లా రాలిపోయారు. థర్డ్‌వేవ్ పిల్లలకు అని ప్రచారం జరుగుతోంది. వచ్చే నెలలో అని నిపుణులు చెబుతున్నారు. దీంతో ఆందోళన నెలకొంది. మరోవైపు వచ్చే ఏడాది సమ్మర్‌లో ఫోర్త్ వేవ్ అని కూడా అంటున్నారు. దీంతో కరోనా 5,6 ఏళ్లు ఉంటుందని అర్థం చేసుకోవచ్చు.
వానకాలం రావడంతో ఫంగస్ ఇంపాక్ట్ తగ్గుతుందని వైద్యులు సూచిస్తున్నారు. ఇప్పటివరకు బ్లాక్ ఫంగస్ ఇంపాక్ట్ కనిపించింది. మొత్తానికి కరోనాతో కలిసి బతకాల్సిందే.. అందుకోసం విధిగా మాస్క్ ధరించి.. శానిటైజర్ రాసుకుంటూ కాలం వెళ్లదీయాల్సిందే. రెండు డోసులతోపాటు బూస్టర్ డోస్ టీకా కూడా తీసుకోవాలని నిపుణులు చెబుతున్నారు. ప్రస్తుతం అయితే అందరికీ సెకండ్ డోసు ఇస్తున్నారు. ఇది పూర్తయితే దేశంలో చాలా మంది రెండు డోసులు తీసుకున్నట్టు అవుతుంది. దీంతోపాటు బూస్టర్ డోసు వేసుకోవాలని నిపుణులు సూచన చేస్తున్నారు. దీనికి సంబంధించి కేంద్ర ప్రభుత్వం విధాన నిర్ణయం అయితే ప్రకటించలేదు. డిసిషన్ తీసుకోవాల్సి ఉంది.












Click it and Unblock the Notifications