Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

ఉత్కంఠ: బీజేపీ ఉవ్వీళ్లు, పీడీపీకి చెక్‌కోసం పావు, ఆఖర్లో ఒమర్ షాక్

శ్రీనగర్: జమ్మూ కాశ్మీర్ అసెంబ్లీ ఎన్నికల్లో ఎక్కువ స్థానాలు (28) గెలుచుకొన్న పీపుల్స్ డెమోక్రాటిక్ పార్టీ (పీడీపీ)కి చెక్ పెట్టేందుకు నేషనల్ కాన్ఫరెన్స్ నేత, మాజీ ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా పావులు కదుపుతున్నారు. అందులో భాగంగా ఆయన 25 స్థానాలు గెలుచుకొని రెండో స్థానంలో ఉన్న బీజేపీ వైపు మొగ్గు చూపుతున్నారు.

జమ్మూ కాశ్మీర్ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ 25, పీడీపీ 28, కాంగ్రెస్ 2, ఎన్సీపీ 15 స్థానాలు గెలుచుకుంది. ఏడుగురు ఇతరులు గెలిచారు. ఈ నేపథ్యంలో మేజిక్ ఫిగర్ (44) పైన పీడీపీ, బీజేపీ కసరత్తు చేస్తోంది. 99 శాతం బీజేపీతో కలవమని చెప్పిన ఒమర్ అబ్దుల్లా రాష్ట్రంలో పీడీపీకీ చెక్ పెట్టేందుకు కమలంతో జట్టు కట్టేందుకు సిద్ధమవుతున్నట్లుగా కనిపిస్తోంది.

బీజేపీ జాతీయ అధ్యక్షులు అమిత్ షా, కేంద్రమంత్రి అరుణ్ జైట్లీలను ఒమర్ కలిశారు. మరోవైపు, బీజేపీ కూడా జమ్మూ కాశ్మీర్‌లో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు ఉవ్వీళ్లూరుతోంది. ఇందుకోసం తమతో కలిసి వచ్చే పార్టీకి పలు పదవులు ఇవ్వాలని చూస్తోంది.

Omar Abdullah meets BJP chief Amit Shah, Arun Jaitley in Delhi

కేంద్రమంత్రి, రాజ్యసభ, ఉపముఖ్యమంత్రి పదవులు

దాదాపు నేషనల్ కాన్ఫరెన్స్ పార్టీ బీజేపీతో జతకట్టే అవకాశాలు కనిపిస్తున్నాయి. పీడీపీకి చెక్ చెప్పాలన్నా ఆ పార్టీకి ప్రత్యామ్నాయాం బీజేపీ మాత్రమే. అంతేకాకుండా, వాజపేయి హయాంలో నేషనల్ కాన్ఫరెన్స్ ఎన్డీయేలో భాగస్వామి. ఇప్పుడు కూడా కలిసే అవకాశాలు కనిపిస్తున్నాయి.

నేషనల్ కాన్ఫరెన్స్ బీజేపీకి మద్దతిస్తే.. కమలం పార్టీ ఆ పార్టీకి ఓ రాజ్యసభ పదవి, ఓ కేంద్రమంత్రి పదవితో పాటు రాష్ట్రంలో ఉప ముఖ్యమంత్రి పదవి ఇచ్చేందుకు సిద్ధమైందని తెలుస్తోంది.

ఇదిలా ఉండగా, బీజేపీ నేతలు రామ్ మాధవ్, అరుణ్ జైట్లీలు జమ్మూ కాశ్మీర్‌లో పార్టీ ఎమ్మెల్యేలతో భేటీ అయ్యారు. వారు ఎమ్మెల్యేల అభిప్రాయాలను తీసుకోనున్నారు. అనంతరం నేషనల్ కాన్ఫరెన్స్, పీడీపీ నేతలతో భేటీ కానున్నారని తెలుస్తోంది.

షాకిచ్చిన ఒమర్

ఇదిలా ఉండగా.. ఎన్సీపీ, బీజేపీ కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తాయని భావించినప్పటికీ చివర్లో ఒమర్ అబ్దుల్లా షాకిచ్చారు. తాము బీజేపీకి ఎట్టి పరిస్థితుల్లో మద్దతిచ్చేది లేదని ఒమర్ చెప్పారు. ఏ ఇతర పక్షాలు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసినా తాము మద్దతివ్వమని నేషనల్ కాన్ఫరెన్స్ నేత ఆగా రోహుల్లా చెప్పారు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+