రష్యానే మాకు ముఖ్యం- ట్రంప్ కు భారత్ రివర్స్ షాక్

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కు భారత్ రివర్స్ షాక్ ఇచ్చింది. రష్యా నుంచి క్రూడాయిల్ కొనుగోళ్లను నిలిపివేయట్లేదని తెలిపింది. ఎప్పట్లాగే ఆయిల్ సరఫరా కొనుసాగుతోందని స్పష్టం చేసింది. రష్యా నుంచి ముడిచమురు దిగుమతులను రద్దు చేసుకున్నట్లు వచ్చిన వార్తల్లో వాస్తవం లేదని వివరించింది.

భారత్ పెట్రోలియం, ఇండియన్ పెట్రోలియం కార్పొరేషన్, హిందుస్తాన్ పెట్రోలియం వంటి దేశీయ ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు ఇప్పటికీ రష్యన్ సప్లయర్ల నుంచి క్రూడాయిల్ ను దిగుమతి చేసుకుంటున్నాయి. కేంద్ర ప్రభుత్వం నిర్ణయించిన బ్యారెల్ రేట్, గ్రేడ్, స్టాక్స్, లాజిస్టిక్స్ వంటి ఆర్థిక అంశాలను బట్టి ఈ నిర్ణయాలు తీసుకుంటున్నాయి.

OMCs continue to source oil from Russian suppliers

ప్రపంచంలో రెండో అతిపెద్ద ముడి చమురు ఉత్పత్తిదారు రష్యా. రోజుకు దాదాపు 9.5 మిలియన్ బ్యారెల్స్ అంటే దాదాపుగా ప్రపంచ డిమాండ్‌లో 10 శాతం మేర ఉత్పత్తి చేస్తుంది. రోజుకు దాదాపు 4.5 మిలియన్ బ్యారెల్స్ ముడి చమురు, 2.3 మిలియన్ బ్యారెల్స్ శుద్ధి చేసిన చమురును ఎగుమతి చేస్తోంది.

రష్యా నుంచి చమురు సరఫరా ఆగిపోతుందనే భయాలతో 2022 మార్చిలో బ్రెంట్ క్రూడ్ ధర బ్యారెల్‌కు 137 డాలర్లకు పెరిగింది. రష్యా చమురుపై అధికారికంగా ఎప్పుడూ ఆంక్షలు విధించలేదు. పైగా జీ7/యూరోపియన్ యూనియన్ దేశాలు ధర పరిమితిని విధించాయి. దీని ఉద్దేశ్యం రష్యా ఆదాయాన్ని తగ్గించడంతో పాటు ప్రపంచ ఇంధన సరఫరాను కొనసాగించడం.

ఈ విషయంలో భారత్ ఒక బాధ్యతాయుతమైన దేశంగా వ్యవహరించింది. మార్కెట్లలో సరఫరాను కొనసాగించింది. ధరలను స్థిరంగా ఉంచింది. భారత్ తీసుకున్న నిర్ణయాలు అంతర్జాతీయ నిబంధనలకు అనుగుణంగా ఉంటోన్నాయి. భారత్ తక్కువ ధరకు లభించే రష్యా చమురును కొనుగోలు చేయకపోతే- ఒపెక్ ప్లస్ దేశాల ఉత్పత్తి కోతలతో కలిపి ప్రపంచ చమురు ధరలు 2022 మార్చి నాటి గరిష్ట స్థాయిని మించి పెరిగేవి. ఇది ప్రపంచవ్యాప్తంగా ద్రవ్యోల్బణాన్ని తీవ్రంగా ప్రభావితం చేసేది.

దేశ ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకొని కేంద్ర ప్రభుత్వం.. రష్యా నుంచి క్రూడాయిల్ ను కొనుగోలు చేయాలని నిర్ణయించింది. అది- ప్రపంచ ఇంధన స్థిరత్వానికి కూడా దోహదపడింది. భారత్ తన వాస్తవిక విధానం ఆధారంగానే చమురు సరఫరాను కొనసాగించింది. ధరలను స్థిరంగా ఉంచగలిగింది. మార్కెట్లను సమతుల్యం చేసింది.

ఈ మధ్య కాలంలో రష్యా నుంచి లిక్విఫైడ్ నేచురల్ గ్యాస్ ను 51 శాతం ఈయూ కొనుగోలు చేసింది. ఆ తర్వాత చైనా 21, జపాన్ 18 శాతం మేర కొనుగోలు చేశాయి. పైప్‌లైన్ గ్యాస్‌లో ఈయూ 37 శాతంతో అగ్రస్థానంలో ఉంది. ఆ తర్వాత చైనా- 30, టర్కీ-27 శాతం ఉన్నాయి.

రష్యా చమురుపై అమెరికా లేదా యూరోపియన్ యూనియన్ ఎప్పుడూ ఆంక్షలు విధించలేదు. అమెరికా ఆంక్షలు విధించిన ఇరాన్ లేదా వెనిజులా నుండి భారతీయ ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు చమురు కొనడం లేదు. రష్యా చమురుపై అమెరికా సిఫార్సు చేసిన 60 డాలర్ల ధర పరిమితిని పాటించాయి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+