సిఎం ఎదుట పెట్టిన వాటర్ బాటిల్‌లో పాము(వీడియో)
రాయ్‌పూర్: ఇప్పటి వరకు కూల్‌డ్రిక్స్‌లలోనే బొద్దింకలు, చిన్న పురుగులు చూశాం. ఇప్పుడు ఏకంగా మినరల్ వాటర్ బాటిల్‌లోనే జీవించి ఉన్న చిన్న పాము కనిపించింది. అది కూడా ఓ రాష్ట్ర ముఖ్యమంత్రికి ముందు పెట్టిన బాటిల్‌లోనే గమనార్హం.
ఛత్తీస్‌గఢ్‌లో భారతీయ జనతా పార్టీ ప్రధాన కార్యాలయం ఏకాత్మ పరిసర్‌లో బుధవారం ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి రమణ్‌సింగ్, కేంద్ర ఆరోగ్య మం త్రి జేపీ నడ్డాల ఆధ్వర్యంలో భేటీ నిర్వహించారు.
కాగా, ప్రధానమంత్రి మౌద్రిక్ యోజనపై చర్చ సాగుతున్న సమయంలో ఒక్కసారిగా వాటర్ బాటిల్ కలకలం రేగింది. భేటీలో సరఫరా చేసిన ‘అమన్ ఆక్వా' మినరల్ వాటర్ బాటిల్‌లో ‘పాము' రావడమే దీనికి కారణం.

కాగా, ఆ సంస్థ.. రాయ్‌పూర్ జిల్లా బిజెపి మైనారిటీ సెల్ ఉపాధ్యక్షుడు సయేద్ అలీ అమన్ కుమారుడు సయేద్ షఫీఖ్ అమన్‌ది కావడం గమనార్హం.
ఇది ఇలా ఉండగా, తమపై ఏదో కుట్ర జరుగుతోందని అమన్ వాటర్ బాటిల్ కంపెనీ పేర్కొంది. తాము బాటిల్ ప్యాక్ చేసేప్పుడు చాలా జాగ్రత్తలు తీసుకుంటామని తెలిపింది. కాగా, రాష్ట్రంలోని అన్ని మినరల్ వాటర్ బాటిళ్ల పరిశ్రమలను తనిఖీ చేయాల్సిందిగా బిజెపి ప్రభుత్వం అధికారులను ఆదేశించింది.












Click it and Unblock the Notifications