వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

Omicron: కేరళ వైద్యుడి నమూనాలు జీనోమ్ సీక్వెన్సింగ్‌కు, కాంటాక్టుల కోసం రూట్ మ్యాప్

|
Google Oneindia TeluguNews

తిరువనంతపురం: ప్రపంచ వ్యాప్తంగా భయాందోళనలకు గురిచేస్తున్న ఒమిక్రాన్ కరోనా వేరియంట్.. ఇప్పుడు మనదేశంలోనూ కలకలం రేపుతోంది. ఇప్పటికే కర్ణాటకలో రెండు ఒమిక్రాన్ కేసులు నమోదైన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో విదేశాల నుంచి వచ్చిన ప్రయాణికులకు పరీక్షలు నిర్వహిస్తున్నాయి అన్ని రాష్ట్రాలు. పలు ఆంక్షలను కూడా విధిస్తున్నాయి.

కేరళలో కరోనా బారినపడిన 46 ఏళ్ల వైద్యుడి నమూనాలను జినోమ్ సీక్వెన్స్ కు పంపారు. సదరు డాక్టర్ నవంబర్ 21న యూకే నుంచి కేరళకు రావడం గమనార్హం. ఈ క్రమంలోనూ అతడి నమూనాలను జీనోమ్ సీక్వీన్సింగ్ కు పంపారు.

Omicron: Kerala doctor’s samples sent for Covid genome sequencing.

కోజికోడ్‌కు చెందిన ఆ వైద్యుడికి నవంబర్ 28న పరీక్షలు నిర్వహించగా కరోనా పాజిటివ్ అని తేలింది. అయితే, ఆయనలో ఎలాంటి లక్షణాలు కనిపించలేదు.

విదేశాల నుంచి కోజికోడ్ వచ్చిన సదరు వైద్యుడు జిల్లాలోని పలు ప్రాంతాల్లో పర్యటించారని కోజికోడ్ జిల్లా మెడికల్ ఆఫీసర్ డాక్టర్ వీ ఉమ్మర్ ఫరూక్ తెలిపారు. అతడు ఎక్కడెక్కడికి వెళ్లింది రూట్ మ్యాప్ చేసి తెలుసుకుంటున్నామని, వారిని గుర్తించి నమూనాలను పరీక్షిస్తామని ఆయన తెలిపారు.

వైద్యుడి తల్లితోపాటు వారింట్లో పని మనిషి నమూనాలను కూడా నమూనాలను కూడా పరీక్షిస్తున్నామని వైద్యాధికారి వెల్లడించారు. వారికి కూడా కరోనా పాజిటివ్ అని తేలితే వారి నమూనాలను జీనోమ్ సీక్వెన్సింగ్ కు పంపిస్తామని ఆయన తెలిపారు.

ఇది ఇలావుండగా, కరోనా రోగులు పారిపోవడం మనదేశంలోని కొన్ని రాష్ట్రాల్లో సమస్యగా మారింది. కర్ణాటకలో ఓ ఒమిక్రాన్ రోగి విదేశాలకు పారిపోగా, మరో 10 మంది కరోనా రోగులు అదృశ్యం కలకలం రేపుతోంది. కర్ణాటకలో ఒమిక్రాన్ బారినపడిన ఇద్దరు రోగుల్లో ఓ రోగి పరారయ్యాడు. ఓ ప్రైవేట్ ల్యాబ్ నుంచి నెగెటివ్ సర్టిఫికేట్ తీసుకని పారిపోవడం గమనార్హం. ఈ మేరకు వివరాలను కర్ణాటక ప్రభుత్వం వెల్లడించింది. అంతేగాక, బెంగళూరు విమానాశ్రయం నుంచి పరారైన మరో పది మంది కరోనా బాధితుల కోసం గాలింపు చేపట్టినట్లు తెలిపింది.

'ఈ రాత్రి వరకు తప్పిపోయినట్లు నివేదించబడిన మొత్తం 10 మంది వ్యక్తులను గుర్తించి, వారిని పరీక్షించాలి. నివేదిక వచ్చే వరకు ప్రయాణికులు విమానాశ్రయం నుంచి బయటకు వెళ్లడానికి అనుమతించబడరు' అని కర్ణాటక రెవెన్యూ మంత్రి ఆర్ అశోక్ ఓమిక్రాన్‌‌పై ఉన్నత స్థాయి సమావేశం అనంతరం వ్యాఖ్యానించారు.

ఓమిక్రాన్-సోకిన 66 ఏళ్ల దక్షిణాఫ్రికా జాతీయుడు "పారిపోయాడు" అని మంత్రి చెప్పారు. అదే సమయంలో వచ్చిన దాదాపు 57 మంది ఇతర ప్రయాణికులను కూడా పరీక్షించామన్నారు. వారంతా RT-PCR నెగెటివ్ సర్టిఫికెట్ చూపినప్పటికీ వారికి పరీక్షలు చేశామని చెప్పారు. పారిపోయిన 10 మంది వ్యక్తు

తప్పిపోయిన 10 మంది వ్యక్తులు తమ ఫోన్‌లను స్విచ్ ఆఫ్ చేశారని, దీంతో వారిని ఫోన్ ద్వారా ట్రాకింగ్ చేయడం కుదరడం లేదని తెలిపారు. 'నెగటివ్ కోవిడ్ పరీక్షను చూపించిన తర్వాత కూడా వారిలో ఒకరు ఓమిక్రాన్‌కు పాజిటివ్‌గా తేలారు కాబట్టి అందరూ ఇప్పుడు పరీక్షించబడతారని మంత్రి చెప్పారు.

ఆ వ్యక్తి దక్షిణాఫ్రికా నుంచి నవంబర్ 20వ తేదీన వచ్చి ఏడు రోజుల తర్వాత దుబాయ్ వెళ్లిపోయాడు. 'మేము పోలీసులకు ఫిర్యాదు చేసాము. షాంగ్రి-లా హోటల్‌లో ఏమి తప్పు జరిగిందో వారు చూస్తారు, అక్కడ నుండి వ్యక్తి తప్పించుకున్నాడు' మంతరి అని చెప్పారు.

అతడు పూర్తిగా వ్యాక్సిన్ తీసుకున్నప్పటికీ అతడు కరోనా బారినపడినట్లు పరీక్షల అనంతరం తేలిందని మంత్రి తెలిపారు. అంతేగాక, అతడు నెగెటివ్ సర్టిఫికేట్ తో ఇక్కడకు వచ్చాడని చెప్పారు. కరోనా సోకడంతో సెల్ఫ్ ఐసోలేషన్లో ఉండాలని అతడ్ని పరీక్షించిన వైద్యులు సూచించారు. ఆ తర్వాత అతడి నమూనాలను జీనోమ్ సీక్వెన్స్ కి పంపారు.

సుమారు 24 మంది అతడ్ని కలిశారని, అయితే వారంతా కరోనా నెగెటివ్ గా తేలిందన్నారు. వారి సెకండరీ కాంటాక్ట్ అయిన మరో 240 మంది కూడా కరోనా నెగెటివ్ నిర్ధారణ అయ్యారు. కాగా, నవంబర్ 27న కరోనా బారిన పడిన వ్యక్తి హోటల్ నుంచి పారిపోయాడని అధికారులు తెలిపారు. ఓ క్యాబ్ ద్వారా విమానాశ్రయానికి చేరుకుని అక్కడ్నుంచి దుబాయ్ కి వెళ్లాడని చెప్పారు. ఒమిక్రాన్ అని తేలినప్పటికీ.. అప్పటికే అతడు దేశం దాటి వెళ్లాడు.

దక్షిణాఫ్రికాతోపాటు ఇతర దేశాల నుంచి కర్ణాటకకు వచ్చే ప్రయాణికులను అందరినీ పరీక్షిస్తున్నామని, లక్షణాలుంటే క్వారంటైన్ చేస్తున్నామని ఆరోగ్యశాఖ మంత్రి కే సుధాకర్ తెలిపారు. ఇప్పటికే పరారైన కరోనా బాధితుల కోసం పోలీసులు గాలింపు చేపట్టారని చెప్పారు. ప్రయాణికులు కూడా పరీక్షలు చేసుకోవాలని, ప్రభుత్వానికి సహకరించాలని కోరారు.

English summary
Omicron: Kerala doctor’s samples sent for Covid genome sequencing.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X